
న్యూఢిల్లీ: ఉమ్మడి న్యాయ ప్రవేశపరీక్ష(క్లాట్) –2018 కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలో విద్యార్థులు కోల్పోయిన సమయానికి అనుగుణంగా మార్కుల్ని జతచేస్తూ ఫిర్యాదుల పరిష్కార కమిటీ (జీఆర్‌సీ) ప్రతిపాదించిన ఫార్ములాకు ఆమోదం తెలిపింది. అలాగే క్లాట్‌ను పూర్తిగా రద్దుచేసి మరోసారి నిర్వహించాలన్న డిమాండ్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీనివల్ల మిగతా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ దీపక్ గుప్తాల వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఎన్‌యూఏఎల్‌ఎస్‌కు చెందిన ఇద్దరు సభ్యుల ఫిర్యాదుల పరిష్కార కమిటీ 4,690 మంది విద్యార్థులకు అన్యాయం జరిగినట్లు కోర్టుకు తెలిపింది. దీంతో సవరించిన మార్కులకు అనుగుణంగా విద్యార్థుల కొత్త మెరిట్ జాబితాను సిద్ధం చేసి జూన్ 16లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సుప్రీం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment