సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చూస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న పటిషనర్ల విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే రద్దు రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు సైతం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడానికి సుప్రీం నిరాకరించింది. కాగా ఆర్టికల్ 370 రద్దుతో పాటు కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసింది. వీటన్నింటిని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇక ముందు కూడా ఇదే ధర్మాసనం విచారణను కొనసాగిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment