
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఓట్ల టోటలైజర్ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం దేశంలో అలాంటి యంత్రాలతో పనిలేదనీ, బూత్‌ల వారీగా ఫలితాలు వెల్లడిస్తేనే అభ్యర్థులకు ఏ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయి, ఎక్కడ ఎక్కువ వచ్చాయి అనే విషయాలు తెలుస్తాయంది. తద్వారా వారు ఓట్లు తక్కువ వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టి పనిచేసే అవకాశం ఉంటుందని న్యాయ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment