totaliser machine
-
ఓటు టోటలైజర్లతో పనిలేదు: సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఓట్ల టోటలైజర్ యంత్రాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం దేశంలో అలాంటి యంత్రాలతో పనిలేదనీ, బూత్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తేనే అభ్యర్థులకు ఏ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయి, ఎక్కడ ఎక్కువ వచ్చాయి అనే విషయాలు తెలుస్తాయంది. తద్వారా వారు ఓట్లు తక్కువ వచ్చిన ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టి పనిచేసే అవకాశం ఉంటుందని న్యాయ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. -
‘టోటలైజర్’పై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఓటింగ్ సరళి బహిర్గతం కాకుండా చూసేందుకు.. ఓటరు గోప్యతను కాపాడేందుకు కొత్త యంత్రాన్ని(టోటలైజర్) ప్రవేశపెట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనపై పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని న్యాయ శాఖకు ఈసీ ఓ లేఖలో తెలియజేసింది. కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ దీనికి మద్దతు తెలిపాయని సమాచారం. బీజేపీ మాత్రం పార్టీల బూత్ మేనేజ్మెంట్కు.. బూత్వారీ ఫలితాలు అవసరమని భావిస్తోంది.