2016-17 రైల్వే బడ్జెట్ హైలైట్స్
కేంద్రమంత్రి సురేశ్ ప్రభు లోక్ సభలో గురువారం 2016-17 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రెండోసారి ఆయన రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.
రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు....
* ప్రయాణికుల, రవాణా ఛార్జీల పెంపు లేదు
*రైళ్లలో పబ్లిక్ ఎనౌన్స్‌మెంట్ సిస్టం ద్వారా ఎఫ్ఎం రేడియో ప్రసారాలు
*వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు
*పోర్టర్లకు కూలీ బదులు సహాయ్ అనే పేరు
*పసిపిల్లల తల్లుల కోసం పిల్లల మెనూ, బేబీ ఫుడ్, బేబీ బోర్డుల ఏర్పాటు
*ఐఆర్‌సీటీసీ ద్వారా ఎక్కడికక్కడ స్థానిక మెనూతో ఆహారం
*త్వరలో రైల్వే టికెట్లకు బార్‌కోడింగ్ సదుపాయం
*ప్రపంచంలో తొలిసారి బిబ్రుగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయో వాక్యూమ్ టాయిలెట్
*ఈ ఏడాది 1600 కిలోమీటర్ల మార్గం విద్యుదీకరణ
*వచ్చే ఏడాది మరో 2వేల కిలోమీటర్ల విద్యుదీకరణకు ప్రతిపాదన
*కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ ఏర్పాటుకు నిరాశే
*కాజీపేట కోచ్ అంశమే ప్రస్తావించని కేంద్రం
*యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ పొడిగింపుకు మొండిచేయి
*విశాఖ రైల్వే జోన్ ను పట్టించుకోని కేంద్రం
*గ్యాంగ్ మెన్లకు రక్షక్ పరికరం అందజేత,
*బెంగళూరు- తిరువనంతపురంలో సబ్ అర్బన్ రైళ్లు
*రైల్వే స్టేషన్లలో యాడ్ రెవెన్యూ పెంపుకు కృషి
*రైల్వే కోచ్ల లీజు అంశం పరిశీలన
*తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ
* బ్రాడ్ గేజ్గా మిజోరాం-మణిపూర్ రైల్వేలైన్ మార్పు
*డిమాండ్కు అనుగుణంగానే రైళ్లు
*తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో అభివృద్ధి
* గూడ్స్ రైలు సగటు వేగం 50 కిలోమీటర్లకు పెంపు
*రైలు కొలిజన్ అవాయిడింగ్ సిస్టమ్
* సెకెండ్ క్లాస్ ప్రయాణినికీ దుప్పట్లు, దిండ్లు
* డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్ఫాం టిక్కెట్లు కొనుగోలు సౌకర్యం
*ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు ఈ-కేటరింగ్ కాంట్రాక్టు
* అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ సర్క్యూట్ రైలు
* చెన్నైలో తొలి రైల్వే ఆటో హబ్ ఏర్పాటు
* ప్రతి వినియోగదారుడు మాకు బ్రాండ్ అంబాసిడరే
* కోచ్లలో చిన్నపిల్లల కోసం పాలు, వేడినీళ్లు
*అన్ని కమ్యూనికేషన్ల కోసం కస్టమర్ మేనేజర్లను నియమిస్తాం
*ముంబై- అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ ట్రైన్, దానికి జపాన్ సాయం
*పార్సిల్ బిజినెస్‌ను మరింత సరళీకరిస్తాం
*ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్ చేసుకునే వీలు కల్పిస్తాం
*2020 నాటికి 4వేల కోట్ల ఆదాయం సాధించే లక్ష్యం పెట్టుకున్నాం
* పుణ్యక్షేత్రాల రైల్వే స్టేషన్లు మరింత ఆధునీకరణ
*ముంబైలో రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం
*టిక్కెట్ బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ వర్తింపు
*408 స్టేషన్లలో ఈ-కేటరింగ్
*కోల్‌కతాలో 100 కిలోమీటర్ల మేర మెట్రో పనులు
*ఈస్ట్‌వెస్ట్ కారిడార్‌కు అన్ని సమస్యలు పరిష్కరించాం
*2018 జూన్ నాటికి ఈ మెట్రో పూర్తవుతుంది
*బెంగళూరులో సబర్బన్ సిస్టం సరిగా లేదు.. దీనికోసం రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తాం
*కేరళలో తిరువనంతపురం నగరానికి కూడా ఇదే అమలుచేస్తాం
*సీనియర్ సిటిజన్ కోటా 50 శాతం పెంపు
*ప్రస్తుతం ఉన్న బెర్త్ లకు అదనంగా 65వేల బెర్త్ల ఏర్పాటు
*రైల్వే పోర్టర్లకు కొత్త యూనిఫాంలు, గ్రూప్ ఇన్సూరెన్స్
*ఆహార నాణ్యత తగ్గకుండా చర్యలు
*రైళ్లలో 30వేల బయో టాయిలెట్స్
* ఇక నుంచి ఆన్ లైన్లోనే రైల్వే నియామకాలు
* జర్నలిస్టులకు ఆన్లైన్లోనే రాయితీ
*ఫారెన్ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ-టికెట్ కొనుగోలు సౌకర్యం
*వృద్ధులకు అనుకూలంగా ఉండే సాథి సేవను మరిన్ని స్టేషన్లకు పొడిగింపు
*రైల్వేస్టేషన్లలో అవసరమైన వారి కోసం అందుబాటులో వేడినీళ్లు
*బయో వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తాం
*నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్
*వడోదరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు
* ప్రతి టైన్లో వృద్ధుల కోసం 120 బెర్త్లు
*139 సర్వీసుతో రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం
*స్వచ్ఛరైల్, స్వచ్ఛభారత్ కోసం స్టేషన్లు, రైళ్లను మరింత శుభ్రం చేయిస్తాం
*కోచ్, టాయిలెట్ లను శుభ్రం చేయించాలని ఎస్ఎంఎస్ తో కోరే అవకాశం
*ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటాం
*దీన్ దయాళ్ బోగీలు
*సామాన్యుల కోసం కొత్తగా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అన్ రిజర్వుడు కేటగిరీలో దీన్ దయాళ్ బోగీలు
*హమ్ సఫర్ 3 ఏసీ సర్వీసు
*తేజస్ - 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో వైఫై, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది
*ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెడతాం
*కొత్తగా మూడు రకాల రైలు సర్వీసులను ప్రకటించిన సురేశ్ ప్రభు
*కొత్తగా హమ్ సఫర్, తేజస్, ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ లు
*ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైల్వే టెండరింగ్లు
*2020 నాటికి గూడ్స్ రైళ్లకు టైంటేబుల్
* అన్ని రైల్వేస్టేషన్లలో సీసీ టీవీల ఏర్పాటు
*నాన్ ఏసీ కోచ్ల్లోనూ డస్ట్ బిన్లు
* సీనియర్ సిటిజన్స్ కు లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం
* రూ.1300 కోట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం
*రైల్వే యూనివర్సిటీని ఈ ఏడాది ప్రారంభిస్తాం
*ఒక్క ప్రమాదం జరిగినా నాకు చాలా బాధ కలుగుతుంది
*జీరో యాక్సిడెంట్లను సాధించాలని అనుకుంటున్నాం
*అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రమాదాలను అధిగమిస్తాం
*కొత్త రైలుబోగీలతో శబ్ద కాలుష్యం తగ్గుతుంది
* 40వేల కోట్లతో రెండు లోకో మోటివ్ పరిశ్రమల ఏర్పాటు
* టైమ్ టేబుల్ ద్వారా రైళ్లను నడిపేందుకు ప్రాధాన్యత
* రూపాయి పెట్టుబడితో 5 రూపాయిల వృద్ధి సాధించిలా కార్యాచరణ
* రాజధాని, శతాబ్ధి రైళ్ల ఫ్రీకెన్సీ పెంపు
*100 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరణ
* ఈ ఏడాది మూడు సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం
* 2016-17 నాటికి 9వేల ఉద్యోగాలకు కల్పన
* అన్ని రైల్వే స్టేషన్లలో డిస్పోజల్ బెడ్ రోల్స్
*ఈ ఏడాది 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా 44 కొత్త ప్రాజెక్టులు
*ఐవీఆర్ఎస్ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్ వస్తున్నాయి
*మహిళలు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోంది.
*ఇప్పుడు రైల్వే మంత్రికి, సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదు
* వచ్చే ఏడాది 2,800 కి.మీ. మేర కొత్త లైన్ల నిర్మాణం
*ఖరగ్ పూర్-ముంబై, ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ట్రిప్లింగ్
* రైల్వేల్లో ఐటీ వినియోగానికి ప్రాధాన్యం
* ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తాం
*జమ్ము-కశ్మీర్ టన్నెల్ వర్క్స్ వేగవంతం
*దేశంలోని మిగతా ప్రాంతాలకు కనెక్టవిటీ
* ఈశాన్య రైల్వే పనులు మరింత వేగవంతం
* పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి
* ప్రతి పౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దుతాం
*రైల్వే టెండరింగ్ విధానంలో పేపర్ లెస్ పద్ధతి
*రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్టివిటీ పెంపు
* పీపీపీ విధానం ద్వారా కొత్త ప్రాజెక్టులు
* ఈ ఏడాది రైల్వే ప్రణాళికా వ్యయం 1.21లక్షల కోట్లు
* వచ్చే ఏడాది 50 శాతం రైల్వేలైన్లు విద్యుద్దీకరణ
* 2016-17 ఆదాయ లక్ష్యం 1.87 లక్షల కోట్ల లక్ష్యం
* సేవల నుంచి సౌకర్యాల వరకూ మరింత మెరుగు
*1.50 లక్షల కోట్లను ఎల్ఐసీ పెట్టుబడి పెడుతోంది
*ఈ ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్‌ను బ్రాడ్ గేజ్‌గా మారుస్తాం
*రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున వీటిని మారుస్తాం. ప్రస్తుతం ఇది 4.8గా ఉంది
*9 కోట్ల మ్యాన్‌డేస్ ఉపాధి కల్పిస్తాం
*రైల్వే మార్గాల విద్యుదీకరణ వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది
*ప్యాసింజర్ రైళ్ల సగటు వేగం 60 కిలోమీటర్లు
*ఎక్స్‌ప్రెస్ వేగం 80 కిలోమీటర్లు
*2020 నాటికి దీర్ఘకాల కోరికలు తీరుస్తాం
*ఆన్ డిమాండ్ రైళ్లను కల్పిస్తాం
* సేఫ్టీ కోసం హై ఎండ్ టెక్నాలజీ
*అన్ మ్యాన్డ్ రైల్వే క్రాసింగులను తీసేయాలి
* రైళ్ల వేగాన్ని మరింతగా పెంచుతాం
* స్వయం సంవృద్ధితో రైల్వేలు
* చార్జీలు పెంచితేనే ఆదాయం కాకుండా, ప్రత్యమ్నాయలు కోసం అన్వేషణ
* గత ఏడాది రూ.8724 కోట్లు ఆదా చేశాం
* రైల్వేలను సరికొత్తగా తీర్చిదిద్దుతాం
* ఈ ఏడాది రెవెన్యూ లోటును తగ్గించగలిగాం
* ఇది సవాళ్లతో కూడిన పరీక్షా సమయం
* అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే పనితీరును మెరుగు పరుస్తున్నాం
* వచ్చే ఏడాది 10 శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం
* ఆదాయ మార్గాల పెంపును అన్వేషిస్తున్నాం
* ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా రైల్వే బడ్జెట్
* ఇది నా ఒక్కడిదీ కాదు....ప్రతి పౌరుడి బడ్జెట్
* సామాన్యుల ఆశలు ప్రతిబింబించేలా రైల్వే బడ్జెట్ రూపొందించాం
* దేశాభివృద్ధికి రైల్వే వెన్నెముకలా ఉండేలా రైల్వే బడ్జెట్
* తన ప్రసంగంలో వాజ్పేయి కవితను చదవి వినిపించిన సురేశ్ ప్రభు
* రైల్వేలో కొత్త ఆలోచన, కొత్త ఆదాయాలకు ప్రతిపాదికన బడ్జెట్