రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రసంగపాఠం మొదలుపెట్టారు. రైల్వే నిలయం నుంచి 11:30 గంటలకు పార్లమెంట్‌కు చేరుకున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి.
కాగా ఈ సారి చార్జీల మోత ఉండకపోవచ్చని సాంకేతాలు అందుతున్నాయి. పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసే అవకాశం ఉంది. స్వదేశీ తయారీ, ఐటీ సేవలకు పెద్దపీట వేయనున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.