Train charges
-
విమాన టికెట్ కంటే ఎక్కువా?
కోల్‌కతా: రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం ఉపసంహరించాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం డిమాండ్ చేశారు. పండుగలు తదితర రద్దీ సందర్భంగా గత వారం దేశవ్యాప్తంగా పలు రూట్లలో రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించిపోతున్నాయని విమర్శించారు. ఇలాగైతే అత్యవసర పరిస్థితిలో రైల్లో ప్రయాణించాల్సిన వారి గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం రద్దు చేయడంతో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మమత గతంలో రైల్వే మంత్రిగా కూడా చేయడం తెలిసిందే. రైలు టికెట్లకు డైనమిక్ ప్రైసింగ్‌ను 2016లో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఛత్ పూజ తదితరాల నేపథ్యంలో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించినట్టు వార్తలొచ్చాయి. -
వృద్ధులకు రాయితీ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పండి
సాక్షి, అమరావతి: రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో వృద్ధులకు ఇచ్చిన రాయితీని కోవిడ్ తగ్గిన తరువాత ఎందుకు పునరుద్ధరించడం లేదో తెలపాలని రైల్వే బోర్డు, ఏపీఎస్ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను మార్చి 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
యూజర్ బాదుడు
-
కార్మికుల రైలు చార్జీలు చెల్లించిన కాంగ్రెస్
సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన 27,865 మంది వలస కార్మికులు, కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించినట్లు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వలస కార్మికులు వారి స్వరాష్టాలకు వెళ్లడానికి అయ్యే రైలు ప్రయాణ ఖర్చులను కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే మహారాష్ట్రలోని పలు జిల్లాలో పేరు నమోదుచేసుకున్న 27,865 మంది వలస కార్మికులకు రైలు టికెట్ చార్జీలను చెల్లించినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!) అదే విధంగా రాష్ట్రం ఇంధన శాఖ మంత్రి నితిన్‌రౌత్ ఆధ్వర్యంలో వలస కార్మికులను తరలించే నాలుగు ప్రత్యేక రైళ్లకు టికెట్ చార్జీలు చెల్లించినట్లు పీసీసీ ప్రకటించింది. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి విజయ్ వాడేటివార్, మహిళ శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతి వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ప్రయాణ రుసుములు చెల్లించారని తెలిపింది. సతారా, అహ్మద్‌నగర్, పుణే నాగ్‌పూర్, చంద్రపూర్, కొల్హాపూర్, సాంగ్లి ప్రాంతాలకు వెళ్లే 3,567మంది వలస కార్మికులను ప్రైవేటు వాహనాల్లో తరలించడానికి అయ్యే ఖర్చును కాంగ్రెస్ పార్టీ చెల్లించిందని పేర్కొంది. ప్రయాణ సమయంలో కార్మికులకు కావాల్సిన ఆహారం, మాస్క్‌లు, శానిటైజర్లను అందజేశామని తెలిపింది. సుమారు 24,000 మందికి వలస కార్మికులు కాంగ్రెస్ పార్టీ అందించిన ప్రయాణ ఖర్చుల సాయంతో బీహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు చేరుకున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ పేర్కొంది. వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు తరలించడానికి కేంద్రం శ్రామిక్ రైళ్లను నడపడానికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. (ఏ రాష్ట్రంలోనూ వారిని అడ్డుకోవద్దు: కేంద్రం) -
‘శ్రామిక్’ చార్జీలపై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు కేంద్రమే ఉచితంగా చేర్చాలని కొన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం, వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియా చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. పీఎం–కేర్స్ నిధులను కార్మికుల కోసం వెచ్చించాలని సీపీఎం డిమాండ్ చేసింది. విపక్షం వ్యాఖ్యలపై అధికార బీజేపీ మండిపడింది. స్వస్థలాలకు తరలివెళ్లే వలస కార్మికుల టికెట్ ఖరీదులో రైల్వేలు 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా మొత్తాన్ని భరిస్తున్నాయని బీజేపీ తెలిపింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ మహాపాత్ర, పార్టీ ఐటీ విభాగం బాధ్యుడు అమిత్ మాల్వీయ ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు చేశారు. ‘వలస కార్మికుల కోసం రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లు నడుపుతోంది. ఏ రైల్వేస్టేషన్‌లోనూ టికెట్లు విక్రయించడం లేదు. టికెట్ రుసుములో రైల్వేలు 85 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. మిగతా 15 శాతం రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తమ వంతు చెల్లించేలా ఆ పార్టీ చీఫ్ సోనియా సూచించాలి’అని వారు కోరారు. విపక్షం మండిపాటు వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం టికెట్ చార్జీలు వసూలు చేస్తున్నందున, ఇకపై తమ పార్టీయే ఆ మొత్తాన్ని భరిస్తుందంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ సోమవారం ప్రకటించారు. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న కార్మికులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంలో సాయం కోసం ఎదురుచూస్తున్న వలస కార్మికులకు పార్టీ రాష్ట్రాల విభాగాలు సాయం అందిస్తాయని తెలిపారు. ఈ అంశంపై సీపీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, లోక్తాంత్రిక్ జనతాదళ్ కూడా స్పందించాయి. ‘పేరులో ఉన్నట్లే పీఎం–కేర్స్ నిధి కేవలం ప్రధాని సంబంధీకులదిగా మారింది. వలస కార్మికులను ఎన్నారైలు(నాన్ రిక్వైర్డ్ ఇండియన్స్)’అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. -
రైల్వే ప్రయాణికులకు షాక్..!
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త ఏడాది తొలిరోజు నుంచే రైల్వే ప్రయాణికులకు షాక్ తగలనుంది. రైలు చార్జీలను మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని తరగతుల ప్రయాణీకుల చార్జీలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్డినరీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటర్‌కు పైసా చొప్పున, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కిలోమీటర్‌కు రెండు పైసలు చొప్పున చార్జీలను పెంచారు. ఏసీ క్లాస్‌కు కిలోమీటర్‌కు 4 పైసల చొప్పున చార్జీలను పెంచినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐదేళ్ల నుంచి రైల్వే చార్జీలను పెంచని దృష్ట్యా రైలు చార్జీలను హేతుబద్ధీకరించామని వెల్లడించింది. చివరిసారిగా 2014-15లో రైలు చార్జీలను పెంచారు. చార్జీల పెంపుతో పాటు రైళ్లలో ప్రయాణీకుల వసతి, సౌకర్యాలను మెరుగుపరుస్తామని, కోచ్‌ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
ఇక రైలు చార్జీల మోత..
సాక్షి, న్యూఢిల్లీ : రైలు చార్జీలను భారీగా పెంచేందుకు భారతీయ రైల్వేలు రంగం సిద్ధం చేస్తున్నాయి. అన్ని రైళ్లు, తరగతుల వారీగా ప్రయాణీకుల చార్జీలను ఈ వారంలోనే పెంచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కిలోమీటర్‌కు 5 నుంచి 40 పైసల వరకూ పెంపు ఉంటుందని ప్రముఖ హిందీ పత్రిక కథనం వెల్లడించింది. రైలు చార్జీల పెంపు ప్రతిపాదనకు నవంబర్లోనే ప్రధాని కార్యాలయం ఆమోదముద్ర వేసినా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటనలో జాప్యం నెలకొంది. ఆర్థిక మందగమనం ప్రభావంతో రైల్వేల ఆర్థిక వనరులపై ఒత్తిడి అధికమైంది. ఇక రోడ్డు రవాణా నుంచి దీటైన పోటీ ఎదురవడంతో సరుకు రవాణా చార్జీలను పెంచే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణీకుల విభాగం నుంచి వచ్చే రాబడిపైనే రైల్వేలు కన్నేశాయి. గత రెండేళ్లుగా ప్రయాణీకుల చార్జీలను నేరుగా పెంచకపోవడంతో తాజాగా చార్జీల పెంపునకే మొగ్గుచూపారు. గతంలో కొన్ని రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ వ్యవస్ధతో పాటు రిఫండ్ వ్యవస్థలో మార్పులు వంటి చర్యలతో రాబడి పెంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రైల్వేల మొత్తం రాబడి గణనయంగా తగ్గి రూ 13,169 కోట్లకు పరిమితమైంది. అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా మొత్తం వ్యయం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. వ్యయ నియంత్రణతో పాటు రాబడి పెంపునకు చార్జీల వడ్డన ద్వారా సమతూకం సాధించాలని రైల్వేలు యోచిస్తున్నాయి. -
భారీ డిస్కౌంట్ ప్రకటించిన రైల్వే
ముంబై : భారతీయ రైల్వే సంస్థ కొన్ని ప్రయోజనాల దృష్ట్యా విద్యార్థులకు భారీ డిస్కౌంట్ని అందించనున్నట్లు తెలిసింది. వివిధ వర్గాల విద్యార్థులకు వేర్వేరు రాయితీలు ప్రకటించింది. వివిధ అవసరాల దృష్ట్యా ప్రతి రోజు రైల్వేలో ప్రయాణిస్తున్న విద్యార్థుల కోసం 25 శాతం నుంచి పూర్తి ఉచిత ప్రయాణ సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపింది. రాయితీల వివరాలు... 1. ప్రతి రోజు జనరల్ క్లాస్‌లో ఎమ్ఎస్టీ(మంత్లీ సీజన్ టికెట్/ నెల పాస్ లాంటిది) మీద ప్రయాణించే అమ్మాయిల కోసం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. బాలికలు పాఠశాల విద్య నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయేంత వరకూ ప్రతి రోజు జనరల్ క్లాస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అబ్బాయిలకయితే ఇంటర్ వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆఫర్ మదర్సాలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. 2. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రయాణించే విద్యార్థులకు ట్రెయిన్ టికెట్ ధర మీద 75 శాతం డిస్కౌంట్ని ప్రకటించింది. అయితే ఇది జనరల్ టికెట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 3. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి పోటి పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లే విద్యార్థులకు ట్రెయిన్ టికెట్ ధర మీద 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. 4. ఇళ్లకు దూరంగా ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం, ఎడ్యుకేషనల్ టూర్ల కోసం వెళ్లే విద్యార్థులకు కూడా రాయితీలు ప్రకటించింది. వీరికి స్లీపర్ క్లాస్ టికెట్స్ మీద 50 శాతం రాయితీ, ఎమ్ఎస్టీ లేదా క్యూఎస్‌టీ(మూడు నెలల పాస్‌లాంటిది)ల మీద 50 శాతం డిస్కౌంట్ని ప్రకటించింది. 5. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇదే స్లీపర్ క్లాస్, ఎమ్ఎస్టీ, క్యూఎస్‌టీల మీద 75 శాతం రాయితీలను ప్రకటించింది. 6. పరిశోధనల నిమిత్తం ప్రయాణించే 35 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఏదైనా రిసెర్చ్ పని మీద వేర్వేరు ప్రదేశాలకు ప్రయాణించే విద్యార్థులకు ట్రెయిన్ టికెట్ చార్జీ మీద 50 శాతం డిస్కౌంట్ని ఇస్తున్నట్లు తెలిపింది. 7. వర్క్ క్యాంప్, కల్చరల్ కాంపీటిషన్ ప్రొగ్రామ్లలో పాల్గొనేందకు వెళ్లే విద్యార్థులకు స్లీపర్ క్లాస్ ట్రెయిన్ టికెట్ చార్జీల మీద 25 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 8. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏడాది ఒకసారి తీసుకెళ్లే స్టడీ టూర్ల కోసం జనరల్ క్లాస్ టికెట్ చార్జీల మీద 75 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. 9. భారతదేశంలో చదివే విదేశీ విద్యార్థులకు కూడా రాయితీలు ప్రకటించింది. భారతదేశంలో చదివే ఫారిన్ స్టూడెంట్స్, భారత ప్రభుత్వం నిర్వహించే ఏదైనా సెమినార్లకు హాజరయ్యేందుకు వెళ్లేటప్పుడు స్లీపర్ క్లాస్ టికెట్ల మీద 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. చారిత్రక ప్రదేశాల పర్యటనకు వెళ్లే విదేశీ విద్యార్థులకు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. 10. భారతీయ రైల్వే సంస్థ క్యాడెట్, మెరైన్ ఇంజనీర్ అప్రెంటిస్‌కు కూడా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. నౌకాయాన లేదా ఇంజనీరింగ్ శిక్షణ కోసం వెళుతున్న విద్యార్థులకు ట్రెయిన్ టికెట్ చార్జీల మీద 50శాతం రాయితీ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ట్రైనింగ్ కార్యక్రమం పూర్తయ్యే వరకూ వర్తిస్తుందని వెల్లడించింది. అయితే ఈ రాయితీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి.. విధి విధానాల గురించి పూర్తి సమాచారాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిసింది. -
గరీబ్‌రథ్ చార్జీలకూ రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : పేదవారి ఏసీ ట్రైన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ చార్జీలూ భారం కానున్నాయి. పదేళ్ల కిందట రూ 25గా నిర్ణయించిన ధరను సవరించాలని రైల్వేలు నిర్ణయించాయి. గత కొన్నేళ్లుగా లినెన్ ధర పెరిగినప్పటికీ గరీబ్ రథ్ రైళ్లలో ప్రయాణీకులకు అందించే దుప్పట్ల ధరను టికెట్ రేటులో కలపలేదు. అయితే తాజాగా ఈ ధరల భారాన్ని గరీబ్ రథ్ చార్జీలను పెంచడం ద్వారా కొంతమేర భర్తీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. బెడ్‌రోల్ ధరలను రైలు చార్జీల్లో కలపాలని కాగ్ కోరిన మీదట ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. రానున్న కొద్ది నెలల్లో బెడ్‌రోల్ ధరలు టికెట్ ధరలో కలపడంతో చార్జీలు కొంతమేర పెరుగుతాయని వెల్లడించారు. బెడ్‌రోల్ కిట్స్ ధరలను టికెట్‌తో పాటే ప్రస్తుతం ఆఫర్ చేస్తుండగా, ఇక వీటి ధరలనూ టికెట్లో కలుపుతామని అధికారులు సంకేతాలు పంపారు. కాగ్ సూచనలతో పేద, సాధారణ ప్రయాణీకులు ఎంచుకునే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల పైనా చార్జీల వడ్డన తప్పేలా లేదు. -
‘ప్రభూ’! మాకేమిచ్చావు.....
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చప్ప చప్పగా ఉంది. నిర్దిష్టమైన ప్రణాళికలనుగానీ, ప్రగతిదాయక ప్రాజెక్టులుగానీ పెద్దగా లేవు. రైల్వే ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్నప్పటికీ రైలు ప్రయాణికులు, సరకు రవాణా చార్జీలను పెంచక పోవడం ప్రస్తుతానికి ఊరటనిచ్చే అంశం. రానున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ చార్జీల జోలికి వెళ్లలేదని స్పష్టమవుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఫ్లాగ్షిప్ కార్యక్రమాలైన మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్, డిజిటల్ ఇండియాకు కాస్త పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. మేన్ ఇన్ ఇండియా కింద 40వేల కోట్ల రూపాయలతో రెండు లోకోమోటివ్ పరిశ్రమలను ప్రకటించారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో రైళ్లలో 17వేల బయో టాయ్లెట్లు, 475 రైల్వే స్టేషన్లలో అదనపు టాయ్లెట్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించారు. కొన్ని రైల్వే స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో సుందరీకరిస్తామని, మరికొన్నింటిని ఆధునీకరిస్తామని చెప్పారు. ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు అన్ని స్టేషన్లలో దశలవారీగా సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 400 రైళ్లలో వైఫై సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తామని, ముందుగా ఈ ఏడాది 100 రైళ్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ స్కీమ్ కొత్తదేమీ కాదు. ఇంతకుముందే గూగుల్‌తో రైల్వే శాఖ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా అవసరమైన చోట రైల్వే యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి సురేశ్ ప్రభు గుజరాత్‌లోని బరోడాకు మాత్రమే ఒక యూనివర్శిటీని ప్రకటించారు. మిగతావి ఎక్కడన్న ఊసే లేదు. హమ్ సఫర్, తేజస్, ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ సర్వీసులను కొత్తగా ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రాజధాని, శతాబ్ది రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచుతున్నట్లు ప్రకటించారు. వీటితో సామాన్య ప్రయాణికులకు ఒరిగేదీమీ లేదు. ఈ ఏడాది దాదాపు రెండువేల కిలీమీటర్ల ట్రాక్‌ను విద్యుదీకరిస్తామని చెప్పారు. 2,800 కిలీమీటర్ల మేర కొత్త లైన్లను నిర్మిస్తామన్నారు. అంతే దూరం మేర బ్రాడ్ గేజ్ పనులను చేపడతామన్నారు. మొత్తంగా 5,300 కిలోమీటర్ల పరిధిలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు 92,714 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు రైల్వే శాఖ వద్ద ఆర్థిక వనరులేమీ లేవు. అయితే జనరల్ బడ్జెట్లో కేంద్రం 40,000 కోట్ల రూపాయల సహాయం ఇస్తానందని, 1.25 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ఎల్ఐసీ అంగీకరించిందని మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. రిజర్వేషన్ల కోటాలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లు 60 కిలీమీటర్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు 80 కిలీమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, కొన్ని రూట్లలో, కొన్ని రైళ్లలో వేగాన్ని గణనీయంగా పెంచుబోతున్నామని చెప్పారు. మధ్యలో రైళ్లు ఆగే సమయాన్ని ఆయన లెక్కలోకి తీసుకోలేదు. ప్రయాణకాలాన్ని పరిగణలోకి తీసుకుంటే సగటున భారత రైళ్లు 38 కిలోమీటర్ల వేగంతోనే నడుస్తున్నాయని రైల్వే శాఖ గణాంకాలే తెలియజేస్తున్నాయి. రైల్వే రెవెన్యూలో ఈ సారి పదిశాతం వృద్ధిని సాధిస్తామని మంత్రి ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు కేవలం 5.8 శాతం మాత్రమే ఉంది. దీన్ని రెండంకెలకు తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. ఇక రూపాయి పెట్టుబడికి ఐదు రూపాయలు సంపాదిస్తామని సురేశ్ ప్రభు సెలవిచ్చారు. ప్రస్తుతం వందరూపాయలకు 97.8 రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును 88.5 శాతానికి తగ్గిస్తామని గతేడాది పెట్టిన టార్గెట్‌నే ప్రభు అందుకోలేక పోయారు. ఏడాదిలో 9 వేల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడున్న సంఖ్యకన్నా అదనంగా కల్పిస్తారా? అన్న విషయంలో స్పష్టల లేదు. ఈ ఏడాదిలో దాదాపు 8,9 వేల మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. ఈ బడ్జెట్ వల్ల కాస్తో కూస్తో ప్రయోజనం కలిగేది ఉన్నత తరగతికి చెందిన ప్రయాణికులకే. సామాన్య, మధ్య తరగతి వారికి ఒరిగేదేమీ లేదు. చార్జీల భారం పడలేదని సంతోషించడం తప్పా. -
2016-17 రైల్వే బడ్జెట్ హైలైట్స్
కేంద్రమంత్రి సురేశ్ ప్రభు లోక్ సభలో గురువారం 2016-17 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు. రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రెండోసారి ఆయన రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు.... * ప్రయాణికుల, రవాణా ఛార్జీల పెంపు లేదు *రైళ్లలో పబ్లిక్ ఎనౌన్స్మెంట్ సిస్టం ద్వారా ఎఫ్ఎం రేడియో ప్రసారాలు *వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు *పోర్టర్లకు కూలీ బదులు సహాయ్ అనే పేరు *పసిపిల్లల తల్లుల కోసం పిల్లల మెనూ, బేబీ ఫుడ్, బేబీ బోర్డుల ఏర్పాటు *ఐఆర్సీటీసీ ద్వారా ఎక్కడికక్కడ స్థానిక మెనూతో ఆహారం *త్వరలో రైల్వే టికెట్లకు బార్‌కోడింగ్ సదుపాయం *ప్రపంచంలో తొలిసారి బిబ్రుగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయో వాక్యూమ్ టాయిలెట్ *ఈ ఏడాది 1600 కిలోమీటర్ల మార్గం విద్యుదీకరణ *వచ్చే ఏడాది మరో 2వేల కిలోమీటర్ల విద్యుదీకరణకు ప్రతిపాదన *కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ ఏర్పాటుకు నిరాశే *కాజీపేట కోచ్ అంశమే ప్రస్తావించని కేంద్రం *యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ పొడిగింపుకు మొండిచేయి *విశాఖ రైల్వే జోన్ ను పట్టించుకోని కేంద్రం *గ్యాంగ్ మెన్లకు రక్షక్ పరికరం అందజేత, *బెంగళూరు- తిరువనంతపురంలో సబ్ అర్బన్ రైళ్లు *రైల్వే స్టేషన్లలో యాడ్ రెవెన్యూ పెంపుకు కృషి *రైల్వే కోచ్‌ల లీజు అంశం పరిశీలన *తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ * బ్రాడ్ గేజ్‌గా మిజోరాం-మణిపూర్ రైల్వేలైన్ మార్పు *డిమాండ్‌కు అనుగుణంగానే రైళ్లు *తెలంగాణ సర్కార్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో అభివృద్ధి * గూడ్స్ రైలు సగటు వేగం 50 కిలోమీటర్లకు పెంపు *రైలు కొలిజన్ అవాయిడింగ్ సిస్టమ్ * సెకెండ్ క్లాస్ ప్రయాణినికీ దుప్పట్లు, దిండ్లు * డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఫ్లాట్‌ఫాం టిక్కెట్లు కొనుగోలు సౌకర్యం *ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు ఈ-కేటరింగ్ కాంట్రాక్టు * అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ సర్క్యూట్ రైలు * చెన్నైలో తొలి రైల్వే ఆటో హబ్ ఏర్పాటు * ప్రతి వినియోగదారుడు మాకు బ్రాండ్ అంబాసిడరే * కోచ్‌లలో చిన్నపిల్లల కోసం పాలు, వేడినీళ్లు *అన్ని కమ్యూనికేషన్ల కోసం కస్టమర్ మేనేజర్లను నియమిస్తాం *ముంబై- అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ ట్రైన్, దానికి జపాన్ సాయం *పార్సిల్ బిజినెస్‌ను మరింత సరళీకరిస్తాం *ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకునే వీలు కల్పిస్తాం *2020 నాటికి 4వేల కోట్ల ఆదాయం సాధించే లక్ష్యం పెట్టుకున్నాం * పుణ్యక్షేత్రాల రైల్వే స్టేషన్లు మరింత ఆధునీకరణ *ముంబైలో రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం *టిక్కెట్ బుకింగ్ సమయంలో ఇన్సూరెన్స్ వర్తింపు *408 స్టేషన్లలో ఈ-కేటరింగ్ *కోల్‌కతాలో 100 కిలోమీటర్ల మేర మెట్రో పనులు *ఈస్ట్‌వెస్ట్ కారిడార్‌కు అన్ని సమస్యలు పరిష్కరించాం *2018 జూన్ నాటికి ఈ మెట్రో పూర్తవుతుంది *బెంగళూరులో సబర్బన్ సిస్టం సరిగా లేదు.. దీనికోసం రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తాం *కేరళలో తిరువనంతపురం నగరానికి కూడా ఇదే అమలుచేస్తాం *సీనియర్ సిటిజన్ కోటా 50 శాతం పెంపు *ప్రస్తుతం ఉన్న బెర్త్ లకు అదనంగా 65వేల బెర్త్‌ల ఏర్పాటు *రైల్వే పోర్టర్లకు కొత్త యూనిఫాంలు, గ్రూప్ ఇన్సూరెన్స్ *ఆహార నాణ్యత తగ్గకుండా చర్యలు *రైళ్లలో 30వేల బయో టాయిలెట్స్ * ఇక నుంచి ఆన్ లైన్లోనే రైల్వే నియామకాలు * జర్నలిస్టులకు ఆన్లైన్లోనే రాయితీ *ఫారెన్ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ-టికెట్ కొనుగోలు సౌకర్యం *వృద్ధులకు అనుకూలంగా ఉండే సాథి సేవను మరిన్ని స్టేషన్లకు పొడిగింపు *రైల్వేస్టేషన్లలో అవసరమైన వారి కోసం అందుబాటులో వేడినీళ్లు *బయో వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తాం *నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్ *వడోదరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు * ప్రతి టైన్లో వృద్ధుల కోసం 120 బెర్త్‌లు *139 సర్వీసుతో రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం *స్వచ్ఛరైల్, స్వచ్ఛభారత్ కోసం స్టేషన్లు, రైళ్లను మరింత శుభ్రం చేయిస్తాం *కోచ్, టాయిలెట్ లను శుభ్రం చేయించాలని ఎస్ఎంఎస్ తో కోరే అవకాశం *ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటాం *దీన్ దయాళ్ బోగీలు *సామాన్యుల కోసం కొత్తగా అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అన్ రిజర్వుడు కేటగిరీలో దీన్ దయాళ్ బోగీలు *హమ్ సఫర్ 3 ఏసీ సర్వీసు *తేజస్ - 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో వైఫై, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది *ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెడతాం *కొత్తగా మూడు రకాల రైలు సర్వీసులను ప్రకటించిన సురేశ్ ప్రభు *కొత్తగా హమ్ సఫర్, తేజస్, ఓవర్ నైట్ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ ప్రెస్ లు *ఎలక్ట్రానిక్ పద్ధతిలో రైల్వే టెండరింగ్లు *2020 నాటికి గూడ్స్ రైళ్లకు టైంటేబుల్ * అన్ని రైల్వేస్టేషన్లలో సీసీ టీవీల ఏర్పాటు *నాన్ ఏసీ కోచ్ల్లోనూ డస్ట్ బిన్లు * సీనియర్ సిటిజన్స్ కు లోయర్ బెర్త్ ల్లో ప్రాధాన్యం * రూ.1300 కోట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం *రైల్వే యూనివర్సిటీని ఈ ఏడాది ప్రారంభిస్తాం *ఒక్క ప్రమాదం జరిగినా నాకు చాలా బాధ కలుగుతుంది *జీరో యాక్సిడెంట్లను సాధించాలని అనుకుంటున్నాం *అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రమాదాలను అధిగమిస్తాం *కొత్త రైలుబోగీలతో శబ్ద కాలుష్యం తగ్గుతుంది * 40వేల కోట్లతో రెండు లోకో మోటివ్ పరిశ్రమల ఏర్పాటు * టైమ్ టేబుల్ ద్వారా రైళ్లను నడిపేందుకు ప్రాధాన్యత * రూపాయి పెట్టుబడితో 5 రూపాయిల వృద్ధి సాధించిలా కార్యాచరణ * రాజధాని, శతాబ్ధి రైళ్ల ఫ్రీకెన్సీ పెంపు *100 స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరణ * ఈ ఏడాది మూడు సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం * 2016-17 నాటికి 9వేల ఉద్యోగాలకు కల్పన * అన్ని రైల్వే స్టేషన్లలో డిస్పోజల్ బెడ్ రోల్స్ *ఈ ఏడాది 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా 44 కొత్త ప్రాజెక్టులు *ఐవీఆర్ఎస్ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్ వస్తున్నాయి *మహిళలు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోంది. *ఇప్పుడు రైల్వే మంత్రికి, సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదు * వచ్చే ఏడాది 2,800 కి.మీ. మేర కొత్త లైన్ల నిర్మాణం *ఖరగ్ పూర్-ముంబై, ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ట్రిప్లింగ్ * రైల్వేల్లో ఐటీ వినియోగానికి ప్రాధాన్యం * ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తాం *జమ్ము-కశ్మీర్ టన్నెల్ వర్క్స్ వేగవంతం *దేశంలోని మిగతా ప్రాంతాలకు కనెక్టవిటీ * ఈశాన్య రైల్వే పనులు మరింత వేగవంతం * పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి * ప్రతి పౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దుతాం *రైల్వే టెండరింగ్ విధానంలో పేపర్ లెస్ పద్ధతి *రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్టివిటీ పెంపు * పీపీపీ విధానం ద్వారా కొత్త ప్రాజెక్టులు * ఈ ఏడాది రైల్వే ప్రణాళికా వ్యయం 1.21లక్షల కోట్లు * వచ్చే ఏడాది 50 శాతం రైల్వేలైన్లు విద్యుద్దీకరణ * 2016-17 ఆదాయ లక్ష్యం 1.87 లక్షల కోట్ల లక్ష్యం * సేవల నుంచి సౌకర్యాల వరకూ మరింత మెరుగు *1.50 లక్షల కోట్లను ఎల్ఐసీ పెట్టుబడి పెడుతోంది *ఈ ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్‌ను బ్రాడ్ గేజ్‌గా మారుస్తాం *రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున వీటిని మారుస్తాం. ప్రస్తుతం ఇది 4.8గా ఉంది *9 కోట్ల మ్యాన్డేస్ ఉపాధి కల్పిస్తాం *రైల్వే మార్గాల విద్యుదీకరణ వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది *ప్యాసింజర్ రైళ్ల సగటు వేగం 60 కిలోమీటర్లు *ఎక్స్‌ప్రెస్ వేగం 80 కిలోమీటర్లు *2020 నాటికి దీర్ఘకాల కోరికలు తీరుస్తాం *ఆన్ డిమాండ్ రైళ్లను కల్పిస్తాం * సేఫ్టీ కోసం హై ఎండ్ టెక్నాలజీ *అన్ మ్యాన్డ్ రైల్వే క్రాసింగులను తీసేయాలి * రైళ్ల వేగాన్ని మరింతగా పెంచుతాం * స్వయం సంవృద్ధితో రైల్వేలు * చార్జీలు పెంచితేనే ఆదాయం కాకుండా, ప్రత్యమ్నాయలు కోసం అన్వేషణ * గత ఏడాది రూ.8724 కోట్లు ఆదా చేశాం * రైల్వేలను సరికొత్తగా తీర్చిదిద్దుతాం * ఈ ఏడాది రెవెన్యూ లోటును తగ్గించగలిగాం * ఇది సవాళ్లతో కూడిన పరీక్షా సమయం * అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే పనితీరును మెరుగు పరుస్తున్నాం * వచ్చే ఏడాది 10 శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం * ఆదాయ మార్గాల పెంపును అన్వేషిస్తున్నాం * ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా రైల్వే బడ్జెట్ * ఇది నా ఒక్కడిదీ కాదు....ప్రతి పౌరుడి బడ్జెట్ * సామాన్యుల ఆశలు ప్రతిబింబించేలా రైల్వే బడ్జెట్ రూపొందించాం * దేశాభివృద్ధికి రైల్వే వెన్నెముకలా ఉండేలా రైల్వే బడ్జెట్ * తన ప్రసంగంలో వాజ్‌పేయి కవితను చదవి వినిపించిన సురేశ్ ప్రభు * రైల్వేలో కొత్త ఆలోచన, కొత్త ఆదాయాలకు ప్రతిపాదికన బడ్జెట్ -
రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రసంగపాఠం మొదలుపెట్టారు. రైల్వే నిలయం నుంచి 11:30 గంటలకు పార్లమెంట్‌కు చేరుకున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. కాగా ఈ సారి చార్జీల మోత ఉండకపోవచ్చని సాంకేతాలు అందుతున్నాయి. పరిశుభ్రత, సౌకర్యాలు, రక్షణకు పెద్దపీటవేసే అవకాశం ఉంది. స్వదేశీ తయారీ, ఐటీ సేవలకు పెద్దపీట వేయనున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. -
రైల్ భవన్ నుంచి పార్లమెంట్‌కు సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం రైల్ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సురేశ్ ప్రభు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ సిద్ధం చేశామని తెలిపారు. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. కాగా ప్రయాణికులపై ఛార్జీల భారం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రత, సదుపాయాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. అలాగే రైల్వేల సామర్థ్యం పెంపునకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ ప్రతులు పార్లమెంట్‌కు చేరాయి. -
రైలు చార్జీలు పెంచుతారా?
న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ రైల్వే వ్యవస్థ అదనపు ఆర్థిక వనరుల సమీకరణకు ప్రయాణికులు, సరకు రవాణా చార్జీలు పెంచుతుందా ? అన్న అంశంపై ప్రయాణికుల ఆసక్తి పెరిగింది. గతేడాది ప్రయాణికుల చార్జీలను వదిలేసి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సరకు రవాణా చార్జీలను పెంచారు. అనంతరం ఏడాది మధ్యలో ప్రయాణికుల ఫస్ట్‌క్లాస్, ఏసీ కోచ్‌ల చార్జీలను సెస్ రూపంలో పెంచారు. ఇప్పుడు కూడా అలాంటి వైఖరినే అవలంబిస్తారా ? గత ఏడాది బడ్జెట్లో సురేశ్ ప్రభు ఎలాంటి కొత్త రైళ్లను ప్రవేశపెట్టక పోయినప్పటికీ ఆశించిన టార్గెట్లు నెరవేరలేదు. ప్రయాణికులు, సరకు రవాణా చార్జీల వల్ల 1,41,416 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1,36, 079 కోట్ల రూపాయల రెవెన్యూ మాత్రమే వచ్చింది. రెవెన్యూలో 3.77 శాతం తగ్గుదల కనిపించింది. ప్రతి వంద రూపాయల రెవెన్యూకు ఖర్చును 85.5 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఖర్చు మాత్రం 97.8 రూపాయలకు పెరిగింది. ప్రయాణికులు, సరకు రవాణా లక్ష్యాలు కూడా ఆమడ దూరంనే ఉండిపోయాయి. వచ్చే మార్చినెల నాటికి 8.50 కోట్ల టన్నుల సరకును రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, గత డిసెంబర్ నెల నాటికి కేవలం 80 లక్షల టన్నుల సరకును మాత్రమే రవాణా చేసింది. మిగతా లక్ష్యాన్ని అందుకునే ఆస్కారమే లేదు. దిగజారిన ఆర్థిక పరిస్థితి కారణంగా జనరల్ బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సిందిగా రైల్వే శాఖ చేసిన విజ్ఞప్తిని ఆర్థిక శాఖ త్రోసిపుచ్చింది. పైగా గతంలోకన్నా 30 శాతం కోత విధిస్తున్నట్టు వెల్లడించింది. కనీసం గ్రాంట్ రూపంలో ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. కేంద్రానికి చెల్లించాల్సిన 8,000 కోట్ల రూపాయల డివిడెంట్ను మాఫీ చేయాల్సిందిగా కోరినా ససేమిరా అంది. స్వయంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చింది. ఈ పరిస్థితికి తోడు ఏడవ వేతన సంఘం సిపార్సులను ఉద్యోగులకు అమలు చేయడం వల్ల రైల్వేలపై ఈ ఏడాది అదనంగా 32,000 కోట్ల రూపాయల భారం పడనుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ కారణంగా పడే భారం దీనికి అదనం. ఇంతటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కొత్త రైళ్లను ప్రకటించే అవకాశం లేదని రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆధునిక హంగులుగల బోగీలను ప్రవేశపెడతామని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించినందున వాటిని ప్రవేశపెట్టి వాటిపై అదనపు చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. సరకు రవాణా చార్జీలతో పాటు ప్రయాణికుల చార్జీలను పెంచేందుకు సురేశ్ ప్రభు మొగ్గు చూపుతున్నా రాజకీయ కారణాలు అందుకు సహకరించడం లేదు. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల చార్జీలను ఇప్పుడు పెంచకపోవచ్చని, ఎన్నికలు అయిన వెంటనే కచ్చితంగా పెంచుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా స్పష్టమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు బుల్లెట్ ట్రెయిన్ల సంగతి మాట పక్కన పెడితే ఈసారి కూడా ఎదుగు బొదుగులేని బడ్జెట్‌నే ఆవిష్కరిస్తారని అర్థమవుతుంది. -
పెట్రోల్ ‘బాంబు’
లీటరుకు రూ. 1.69 పెంపు డీజిల్ లీటరుకు 50 పైసల వడ్డింపు న్యూఢిల్లీ: రైలు చార్జీల భారం మరవకముందే, మోడీ సర్కారు మరో గుదిబండను సామాన్యుడిపై వేసింది. ఈసారి పెట్రోలు, డీజిల్ చార్జీల మోత మోగించింది. పెట్రోలు లీటరు ధర రూ.1.69, డీజిల్ 50 పైసలు పెంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. ఇరాక్‌లో కొనసాగుతున్న సంక్షోభం అంతర్జాతీయ చమురు ధరలపై తీవ్రంగా ప్రభావం చూపటంతో పెట్రో ధరల పెంపు అనివార్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పెంచిన రూ.1.69కి స్థానిక అమ్మకపు పన్ను, వ్యాట్ ట్యాక్స్ కలిపితే మరింతగా ధర పెరిగినట్టవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.2.02 పెరిగింది. దీంతో లీటరు పెట్రోలు రూ.73.58 అయింది. డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు 56పైసలు పెరిగి రూ.57.84కు చేరుకుంది. పశ్చిమాసియాలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి వల్ల అంతర్జాతీయ ముడిచమురు ధర బ్యారెల్‌కు 4 డాలర్లు పెరిగింది. దీని ప్రభావం మన దేశంలో ధరలపై పడింది. సబ్సిడీల్లో కోత పెట్టేందుకు ప్రతినెలా కొద్దికొద్దిగా డీజిల్ చార్జీలు పెంచాలన్న యూపీఏ 2013 జనవరి నాటి విధానం వల్ల ఇప్పటికి 17సార్లు ధరలు పెరిగాయి. అయినా, లీటరు డీజిల్‌పైన రూ.3.40 నష్టం వస్తోందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. హైదరాబాద్‌లో.. పాత ధర కొత్త ధర పెట్రోల్ 78.17 80.38 డీజిల్ 62.41 63.03 -
ఎంత కఠినమో
-
రైలు ప్రయాణం పెనుభారం
- సరుకు రవాణాపై తప్పని వడ్డన - సర్వత్రా వ్యక్తమవుతున్న నిరసన - భారీగా పెరిగిన రైలు చార్జీలు - మోడీ ప్రభుత్వ నిర్ణయంపై జనం ఆగ్రహం గూడూరు/ నెల్లూరు (నవాబుపేట)/ నెల్లూరు (సెంట్రల్) : పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుకూలమైన రైలు ప్రయాణం మరింత భారంగా మారింది. ప్రజలపై భారాలు మోపకుండానే దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని హామీలు గుప్పించిన నరేంద్రమోడీ ప్రధానిగా ఎన్నికై కొద్ది రోజుల్లోనే రైలు చార్జీలను మరింతగా పెంచి తన అసలు స్వరూపాన్ని చాటుకున్నారు. బస్సులెక్కి చార్జీలు చెల్లించలేక గంటల తరబడి కూడా వేచి ఉండి పేద, మధ్యతరగతి ప్రజలు రైలు ప్రయాణాలే చేశారు. ఒక్కసారిగా రైలు చార్జీలు కూడా భారీగా పెరగడంతో ప్రయాణికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పెరిగిన రైలు చార్జీల్లో ఈ నెల 25వ తేదీ నుంచి అమలు కానున్నాయి. రైలు ప్రయాణంపై 14.2 శాతం పెరగ్గా, లగేజీ చార్జీలు కూడా 6.5 శాతం పెరగడంపై అందరిలోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సాధారణంగా ప్రయాణ చార్జీలపై 10 శాతం మాత్రమే పెరగాల్సి ఉండగా, ఇందన సర్దుబాటు పేరుతో అదనంగా 4.2 శాతాన్ని పెంచి 14.2 శాతం పెంపుదలను వడ్డించారు. రవాణాపై కూడా 5 శాతం మాత్రమే పెరగాల్సి ఉండగా 1.5 శాతం అదనంగా పెరగడం జరిగింది. ముఖ్యంగా గూడూరుతో పాటు పలు రైల్వేస్టేషన్ల నుంచి నిత్యం చెన్నై, హైదరాబాద్‌కు వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. గూడూరు నిమ్మ మార్కెట్ నుంచి నిమ్మకాయలు భారీగా చెన్నై, మైసూర్, బెంగళూర్ తదితర ప్రాంతాలతో పాటు సిలిగురి, బొకారో, హౌరా, ధన్‌బాద్ తదితర సుదూర ప్రాంతాలకు కూడా నిత్యం వందల టన్నులు నిమ్మకాయలు పలు రైళ్లలో ఎగుమతి అవుతున్నాయి. దీనిపై కూడా చార్జీలు విపరీతంగా పెరగడంతో అందరిపై పెనుభారం పడి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైలు ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరగడంతో స్టీపర్ క్లాస్ చార్జీలో ఒక్కో టికెట్‌పై రూ.30 నుంచి రూ.80 వరకూ పెరగనున్నాయి. ఏసీ క్లాస్‌కు రూ.90 నుంచి రూ.540 వరకూ పెరగనున్నాయి. రవాణాపై కూడా చార్జీలు పెరగడంతో కేజీ నిమ్మకాయలకు గతంలో రూ. 5 నుంచి రూ.7 వంతున 40 కిలో ప్యాకింగ్ కు రూ. 200 నుంచి రూ. 280 వరకు ఉండగా ప్రస్తుతం పెరిగిన లగేజీ చార్జీలతో అది కాస్తా రూ.215 నుంచి రూ.300 వరకు పెరగనుంది. మాలాంటి వారికెంతో ఇబ్బందే: పురుషోత్తం బస్సుల్లో చార్జీలు పెట్టలేక రైళ్లలో వెళుతున్నాం. ఇప్పుడు రైలు చార్జీలు కూడా పెరగడంతో మాలాంటి వారెంతో ఇబ్బంది పడాల్సి ఉంది. మాలాంటి పేద, మధ్య తరగ తి వారు ఇక రైళ్లలో కూడా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. -
ధర్నాలు, దహనాలు
రైల్వే చార్జీల పెంపుపై దేశవ్యాప్త నిరసనలు ఉపసంహరించాలని విపక్షాల డిమాండ్ ఢిల్లీ, యూపీ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైలు చార్జీలను భారీగా పెంచడంపై శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో విపక్షాలు ధర్నాలు, రైల్‌రోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టాయి. సామాన్యులపై పెను భారం మోపేలా ఉన్న ఈ చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ అరవిందర్‌సింగ్ లవ్లీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రైల్ భవన్ వెలుపల ధర్నా నిర్వహించారు. సీపీఎం నేతలు కూడా వీరికి జత కలిశారు. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్తంభించింది. నిరసనకారులు బ్యారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వాటర్ కేనన్లతో వారిన చెదరగొట్టారు. తమను గెలిపిస్తే దేశానికి మంచి రోజులు తీసుకొస్తామంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పిన వారు (ప్రధాని మోడీని ఉద్దేశించి) ఇప్పుడు కఠిన నిర్ణయాలు, చేదు గుళికలు అంటూ మాట్లాడుతున్నారని లవ్లీ దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అధికార సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎదుట ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద ప్రధాని మోడీ దిష్టబొమ్మను తగలబెట్టడంతోపాటు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఎస్పీ కార్యకర్తలతో ఘర్షణకు దిగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. వారణాసి, అలహాబాద్, మథుర, అలీగఢ్, కాన్పూర్ తదితర రైల్వే స్టేషన్ల వద్ద నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గత యూపీఏ ప్రభుత్వం రైలు చార్జీలను పెంచగా అది ప్రజావ్యతిరేక విధానమంటూ నాటి ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాసిన గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ ఇప్పుడు అదే ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారని బెంగాల్ ప్రతిపక్ష నేత సూర్యకాంతా మిశ్రా విమర్శించారు. కేరళలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో రైల్‌రోకోలు చేపట్టి నిరసన తెలిపారు. మరోవైపు రైలు చార్జీలను తగ్గించాలంటూ డీఎంకే చీఫ్ కరుణానిధి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి గత యూపీఏ సర్కారుకు ఏమాత్రం భిన్నంగా లేదని విమర్శించారు. -
రెలైక్కలేం
-
రైలు చార్జీల పెంపుతో సామాన్యుల గగ్గోలు
-
ఎంత కఠినమో
- రైలు చార్జీల పెంపుతో సామాన్యుల గగ్గోలు - జిల్లా ప్రయాణికులపై రోజూ రూ.లక్షల అదనపు భారం సాక్షి, రాజమండ్రి / రాజమండ్రి సిటీ : నరేంద్రమోడీ సర్కారు ఆదిలోనే తీసుకున్న బాదుడు నిర్ణయం జిల్లా ప్రజలపై అదనపు భారం మోపుతోంది. ముందెన్నడూ లేని విధంగా అన్ని రకాల రైలు ప్రయాణ చార్జీలను 14.2 శాతం పెంచడంతో జిల్లావాసులు గగ్గోలు పెడుతున్నారు. రైలు చార్జీల పెంపు ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరిగినా సాధారణ ప్రయాణికులను మినహాయిస్తారని భావించారు. అయితే మోడీ సర్కారు.. ‘వడ్డించే’ విషయంలో తనకు ఎలాంటి విచక్షణా లేదని చాటుకుంది. జిల్లాలో ప్రధాన మైన రాజమండ్రి రైల్వేస్టేషన్ నుంచి రోజూ 30 వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. సుమారు 3000 మంది రిజర్వేషన్‌తో వివిధ తరగతుల్లో ప్రయాణిస్తారు. తర్వాత ముఖ్యమైన సామర్లకోట నుంచి సుమారు 20 వేల మంది అన్ని తరగతుల్లో ప్రయాణిస్తారు. 2000 మందికి పైగా రిజర్వేషన్లను పొందుతారు. జిల్లా కేంద్రం కాకినాడ నుంచి రోజూ సుమారు 10 వేల మంది ప్రయాణిస్తారు. వెయ్యి మంది వరకూ రిజర్వేషన్లు చేయించుకుంటారు. పెంచిన చార్జీలతో నిత్యం వీరందరిపై రూ.లక్షల్లో అదనపు భారం పడనుంది. ప్రయాణ చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం పెరగడం వలన రాజమండ్రి స్టేషన్ నుంచి నిత్యం జరిగే వివిధ సరుకుల రవాణాపై అదనపు భారం పడనుంది. చార్జీల పెంపు దారుణం.. ప్రజారంజకమైన పాలన అంటూ గద్దె నెక్కిన మోడీ సర్కార్ రైలు చార్జీలను అమాంతం పెంచి పేదల నడ్డి విరిచింది. పాలన చేపట్టి నెల కాకుండానే ఇలా చేయడం దారుణం. ధనిక వర్గాలతో సమానంగా టిక్కెట్ ధర పెంచడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. పెంపును విరమించి పేదలను ఆదుకోవాలి. - కేఎల్ఎన్రెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, రాజమండ్రి -
సామాన్యులపై పెనుభారం: జగన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలను ఉన్నట్టుండి భారీగా పెంచడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు..ప్రయాణికుల చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచడం వల్ల సామాన్యులపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సరుకు రవాణా చార్జీల పెంపు అనేక రంగాలపై ప్రభావం చూపుతుందని, దాని వల్ల కూడా సామాన్యులపైనే పెనుభారం పడుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారని, చార్జీల పెంపుతో వారి నడ్డి విరిచారని విమర్శించారు. పెంపు వల్ల నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముందని, పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్రం రైల్వే చార్జీలను ఏకపక్షంగా పెంచడం దారణమని పేర్కొన్నారు. తక్షణం తగ్గించాలి: సీపీఎం రైల్వే చార్జీల పెంపును సీపీఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. గత కాంగ్రెస్ పభుత్వం ఎన్నో భారాలు మోపి సామాన్యుల జీవితాలను దుర్బరం చేసిందని, బీజేపీ ప్రభుత్వం దాని దారిలో నడుస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఓ ప్రకటనలో ఆరోపించారు. -
రైలు చార్జీల మోత
ప్రయాణికులపై 8 వేల కోట్ల భారం సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రైల్వే ప్రయాణికులపై చార్జీల బాంబు పేలింది. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ సర్కారు నెల తిరగకముందే రైల్వే చార్జీలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరిపైనా చార్జీల భారం మోపింది. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టటానికి కొద్ది రోజుల ముందుగా అన్ని తరగతుల ప్రయాణ చార్జీలనూ, సరకు రవాణా చార్జీలనూ పెంచేసింది. రైలు ప్రయాణ చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచగా.. రైల్వే రవాణా చార్జీలను 6.5 శాతం పెంచింది. తద్వారా ఏటా రూ.8వేల కోట్ల మేర ప్రజ లపై నేరుగా భారం మోపింది. పెరిగిన చార్జీలు ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. ప్రయాణ చార్జీల పెంపు ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుండగా.. రవాణా చార్జీల పెంపు ప్రభావం పారిశ్రామిక రంగంతో పాటు.. అన్ని రకాల నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీయటం ద్వారా పరోక్షంగా భారాన్ని మరింత పెంచనుంది. రైలు చార్జీల పెంపును ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా తప్పుపట్టాయి. ఇంత భారీగా చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపటం నేరపూరితమని ఎన్డీఏ సర్కారుపై మండిపడ్డాయి. చార్జీలను పెంచే ముందుగా పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదని ప్రశ్నించాయి. ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రకటించాక.. చార్జీల పెంపు నిర్ణయాన్ని తీసుకోవటంలో ఔచిత్యమేమిటని నిలదీశాయి. పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్న వారం రోజుల్లోనే రైల్వే చార్జీల పెంపును ప్రకటించటం గమనార్హం. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన మే 16వ తేదీనే రైల్వేశాఖ చార్జీల పెంపును ప్రకటించింది. పెంపు అదే నెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కూడా చెప్పింది. అయితే ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో పెంపు ప్రకటన చేయటం పట్ల తీవ్ర విమర్శలు రావటంతో.. చార్జీల పెంపు అమలుపై రైల్వేబోర్డు వెనక్కు తగ్గింది. చార్జీల పెంపుకు సంబంధించిన వ్యవహారాన్ని తర్వాత రాబోయే ప్రభుత్వానికే అప్పగించాలని రైల్వేబోర్డుకు నిర్దేశిస్తూ నాటి యూపీఏ సర్కారులోని రైల్వేమంత్రి మల్లిఖార్జునఖర్గే ప్రకటన జారీచేశారు. ఈ మేరకు చార్జీల పెంపును నిలిపివేస్తున్నట్లు రైల్వేబోర్డు ఆ వెంటనే అధికారికంగా ప్రకటించింది. ‘నిలిపివేత’ను ఉపసంహరిస్తున్నానంతే... తాజాగా శుక్రవారం రైలు చార్జీల పెంపును ఢిల్లీలో ప్రకటించిన కొత్త రైల్వే మంత్రి సదానంద్గౌడ.. ‘‘మా ముందరి మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేయక తప్పని పరిస్థితి. చార్జీల పెంపును నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను మాత్రమే నేను ఉపసంహరిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. గత (యూపీఏ) ప్రభుత్వం సమర్పించిన తాత్కాలిక బడ్జెట్లో.. మే 16వ తేదీన ప్రకటించిన చార్జీల పెంపు ప్రాతిపదికగా ఆదాయాన్ని అంచనా వేసిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఖరారు చేసిన చార్జీలను పెంచనిదే వార్షిక వ్యయాన్ని పూర్తిచేయటం సాధ్యం కాదన్నారు. కాబట్టి.. సవరించిన ప్రయాణ చార్జీలు, రవాణా చార్జీల పెంపును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తున్నట్లు వివరించారు. దీంతో.. ఈ నెల 25వ తేదీ నుంచి పెంచిన ప్రయాణ, రవాణా చార్జీలు అమలులోకి వస్తాయని తెలిపారు. రైల్వేకు ప్రయాణ విభాగంలో ఏటా 900 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. చమురు ధరలు తగ్గితే ఎఫ్‌ఏసీని సమీక్షిస్తాం: రైల్వేశాఖ చార్జీల పెంపుపై తీవ్ర విమర్శలు రావటంతో రైల్వేశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తాజా పెంపుపై వివరణ ఇచ్చింది. రైల్వే ప్రయాణ చార్జీలను 10 శాతం, రవాణా చార్జీలను 5 శాతం చొప్పున పెంచామని.. అయితే ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఏసీ) కూడా కలవటంతో ఈ పెంపు 14.2 శాతానికి, 6.5 శాతానికి పెరిగాయని పేర్కొంది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల ప్రకారం రిటైల్ పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ ధరలను సవరించినట్లు.. ప్రతి ఆరు నెలలకోసారి రైల్వే కూడా ఎఫ్‌ఏసీని సవరిస్తుందని వివరించింది. చమురు ధరల కారణంగా పెంచిన ఎఫ్‌ఏసీని.. చమురు ధరలు తగ్గిన పక్షంలో సమీక్షించటం జరుగుతుందని తెలిపింది. గత ప్రభుత్వం కూడా రెండు పర్యాయాలు ఎఫ్‌ఏసీని అమలు చేసిందని.. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్‌లో దీనిని అమలు చేసిందని ఉటంకించింది. ముందే తీసుకున్న టికెట్లకూ పెరిగిన చార్జీలు వర్తిస్తాయి ప్రయాణ చార్జీలను అన్ని తరగతుల్లోనూ 10 శాతం మేర పెంచగా.. ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్ఏసీ) రూపంలో అదనంగా మరో 4.2 శాతం పెంచారు. మొత్తంగా 14.2 శాతం మేర అన్ని తరగతుల చార్జీలూ భారం కానున్నాయి. లోకల్ రైలు టిక్కెట్లు, నెలవారీ పాస్‌ల పైన కూడా చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు ఈ నెల 25 (బుధవారం) అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. 25వ తేదీ అర్ధరాత్రి తర్వాత ప్రయాణం చేయటం కోసం.. పెరిగిన చార్జీల కన్నా ముందే ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లను తీసుకుని ఉంటే.. పెరిగిన చార్జీల మేరకు తేడాను టికెట్ కౌంటర్లలో కానీ, ప్రయాణ సమయంలో రైళ్లలో టీటీఈలకు గానీ చెల్లించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. రిజర్వేషన్ చార్జీలు, సూపర్‌ఫాస్ట్ చార్జీలను పెంచలేదు. ఇదా మీ సానుభూతి?: కాంగ్రెస్ ‘‘ప్రభుత్వంలోకి వచ్చాక.. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా.. శ్వేతపత్రం విడుదల చేయకుండా.. రైల్వే బడ్జెట్ కోసం ఆగకుండా.. రైల్వే ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదం టూ.. చార్జీలను పెంచేశారు. నిన్నటివరకూ సామాన్యుడి ఆందోళనలను ఎలా పరిష్కరించాలనే దానిగురించి మాట్లాడిన వీరు.. తమకు ఓటేసి అధికారంలోకి తీసుకువచ్చిన అదే సామాన్యుడిపై ఇప్పుడు భారం మోపటం మొదలుపెట్టారు.. సామాన్యుడిపై చూపుతున్న సానుభూతి ఇదా?’’ అని కాంగ్రెస్ నేత మనీశ్‌తివారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరపూరితం.. ఉపసంహరించాలి: సీపీఎం ‘‘రైల్వే చార్జీల అనూహ్య పెంపును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే అదుపులేని ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై రైలు చార్జీల పెంపు పెను భారంగా మారుతుంది. ఇది నేరపూరితం. చార్జీల పెంపును ఉపసంహరించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అసలీ ప్రభుత్వ కపటత్వాన్ని చూడండి.. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల మధ్య, బడ్జెట్‌కు ముందు చార్జీలు పెంచితే.. ఎంత అప్రజాస్వామికమోనని వారు అంటారు. మోడీ సర్కారు సరిగ్గా అదే అప్రజాస్వామికంగా పార్లమెంటును అధిగమించి చార్జీలు పెంచింది’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మండిపడ్డారు. సరకు రవాణా చార్జీలు 6.5% సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచగా.. ఇందులో 1.4 శాతం ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఏసీ)గా రైల్వే పేర్కొంది. సరకుల వర్గీకరణను కూడా 4 తరగతుల నుంచి 3 తరగతులకు తగ్గించారు. ఇప్పటి వరకు సరకు రవాణాకు కనీస దూరం 100 కిలోమీటర్లు కాగా.. దీనిని ఇప్పుడు 125 కిలోమీటర్లకు పెంచారు. సరకు రవాణా చార్జీల పెంపు పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా ఉక్కు, సిమెంటు, విద్యుత్, ఎరువులు, రసాయనాలు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల ధరలూ పెరగనున్నాయి. పెరిగిన రైల్వే చార్జీలు ఇవీ.. సాక్షి, హైదరాబాద్/విజయవాడ/విశాఖపట్నం/తిరుపతి: రైల్వే చార్జీల పెరుగుదల ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల చార్జీలను తట్టుకోలేక రైళ్లను ఆశ్రయిస్తున్న జనానికి.. ఇప్పుడు ఆ చార్జీలు కూడా భారీగా పెరగటం ఇబ్బందికరంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతినిత్యం 709 రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీరందరిపైనా చార్జీల ప్రభావం ఉండనుంది. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే సుమారు రెండు లక్షల మంది నిత్యం రాకపోకాలు సాగిస్తారని అంచనా. 300 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణానికి స్లీపర్ క్లాస్ అయితే సుమారు రూ. 30 నుంచి రూ. 50 మేర చార్జీ పెరిగింది. ఏసీ త్రీ టైర్, టు టైర్ అయితే రూ. 50 నుంచి రూ. 100 మధ్య పెరిగింది. వరుసగా రెండేళ్లు భారీ వడ్డనలు.. యూపీఏ హయాంలో గతేడాది రైల్వే చార్జీలు భారీగా పెరిగాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మరోసారి చార్జీల భారం మోపింది. కేవలం ఏడాది కాలంలోనే ప్రజలపై రెండు సార్లు రైల్వే చార్జీల భారం పిడుగుపాటులా పడడం గమనార్హం. అంతకుముందు పదేళ్ల పాటు రైల్వే చార్జీల్లో ఎగువ స్థాయి తరగతుల్లో ఒకటీ అరా పెంపు తప్ప ఎలాంటి మార్పులూ లేవు. అయితే.. 2012 ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్‌త్రివేది రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రూ. 4000 కోట్ల మేర చార్జీల పెంపు ప్రకటించారు. కానీ తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సమయంలో త్రివేది మంత్రి పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది. కానీ ఆ మరుసటి ఏడాది.. అంటే గత ఏడాది 2013 జనవరి 21న అప్పటి రైల్వే మంత్రి బన్సల్ చార్జీలు పెంచారు. యూపీఏ-2 పాలనా కాలం పూర్తయ్యే వరకు కూడా చార్జీలు పెంచొద్దని భావించినప్పటికీ నష్టాలు, నిర్వహణ భారం దృష్ట్యా చార్జీల పెంపు అనివార్యమైందని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ఏడాది ప్రజలపైన రూ. 6,600 కోట్ల మేర భారం పడింది. -
త్వరలో రైలు చార్జీల పెంపు!
జూలై రెండోవారంలో బడ్జెట్ న్యూఢిల్లీ: త్వరలో రైలు చార్జీలు పెరిగే సూచనలు కన్పిస్తున్నారుు. 2014-15 రైల్వే బడ్జెట్‌ను మంత్రి సదానందగౌడ వచ్చే నెల రెండోవారంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రయూణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలు పెంచే ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ‘రైల్వేల ఆర్ధిక పరిస్థితి అంత బాగా ఏమీ లేనందున చార్జీల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అరుుతే ఎంత మేరకు పెంచాలో ఇంకా ఖరారు కాలేదు..’ అని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు చెప్పారు. రైల్వే బడ్జెట్ సందర్భంగానే ఈ పెంపు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ఉండదని చెప్పలేమని, అరుుతే బడ్జెట్ సందర్భంగానే చార్జీల పెంపును ప్రకటించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందు లేదా తర్వాతైనా సరే పెంచవచ్చునని అన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో మధ్యంతర రైల్వే బడ్జెట్ సందర్భంగా యూపీఏ ప్రభుత్వం ప్రయూణికుల చార్జీల పెంపు జోలికెళ్లలేదు. అరుుతే గత మే 16వ తేదీన రైల్వే శాఖ ప్రయూణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీల్లో 14.2%, 6.5% చొప్పున పెంపుదలను ప్రకటించినా.. ఆ మరుసటి రోజే నిర్ణయూన్ని కొత్తగా వచ్చే రైల్వే మంత్రికే వదిలేస్తూ సదరు నోటిఫికేషన్‌ను నిలిపివేసింది. -
రైలు చార్జీలు పెరగొచ్చు: సదానందగౌడ
దొడ్డబళ్లాపురం (కర్ణాటక): ప్రయాణికులకు ఉత్తమ సేవలందించాలనే లక్ష్యంలో భాగంగా రైలు చార్జీలు పెంచినా తప్పులేదని రైల్వే శాఖ మంత్రి డీవీ సదానందగౌడ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సేఫ్టీ, సర్వీస్, సెక్యూరిటీ కోరుకుంటున్న ప్రయాణీకులు.. ఈ చార్జీల పెంపునకు సముఖంగా ఉన్నారన్నారు. చైనా, జపాన్ దేశాల తరహాలో మన దేశంలోనూ బుల్లెట్ ట్రైన్ సేవలందించే యోచన ఉన్నట్లు తెలిపారు. గత రైల్వే మంత్రి ఖర్గే పలు స్టేషన్లలో రైళ్ల నిలుపుదలను రద్దు చేశారని, అయితే అవి యథావిధిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
రాజధాని, శతాబ్ది రైలు చార్జీల పెంపు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ రైళ్ల చార్జీలు ఇటీవలే పెంచిన రైల్వే శాఖ.. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియర్ రైళ్ల చార్జీలను కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి పెంపు అమల్లోకి రానుంది. ఈ రైళ్ల టికెట్ చార్జీలు రూ.20 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశముందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వాస్తవానికి రైలు టికెట్ చార్జీ ఏమాత్రం పెంచలేదని, ఆహార పదార్థాల ధరలు పెంచేసరికి అది మొత్తం టికెట్ ధరలో పెంపుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రీమియర్ రైళ్లలో ఆహార పదార్థాల చార్జీని కూడా టికెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారు.