రైల్ భవన్ నుంచి పార్లమెంట్కు సురేశ్ ప్రభు | we'll be successful in addressing the needs and aspirations of people of country: Suresh Prabhu | Sakshi
Sakshi News home page

రైల్ భవన్ నుంచి పార్లమెంట్కు సురేశ్ ప్రభు

Published Thu, Feb 25 2016 11:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

రైల్ భవన్ నుంచి పార్లమెంట్కు సురేశ్ ప్రభు

రైల్ భవన్ నుంచి పార్లమెంట్కు సురేశ్ ప్రభు

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం రైల్ భవన్కు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన పార్లమెంట్కు చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సురేశ్ ప్రభు లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ సిద్ధం చేశామని తెలిపారు. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు.

కాగా  ప్రయాణికులపై ఛార్జీల భారం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రత, సదుపాయాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. అలాగే రైల్వేల సామర్థ్యం పెంపునకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ ప్రతులు పార్లమెంట్కు చేరాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement