న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల చార్జీలను డిసెంబర్ 25నుంచి పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నటు తెలిపింది. పెంపు ప్రకారం స్లీపర్ క్లాస్‌లో రూ.175 ఉన్న టికెట్ ధర రూ. 200కు, ఏసీ-3టైర్‌లో రూ.350 ఉన్న ధర రూ.400కు, ఏసీ-2టైర్‌ను రూ. 500 కు పెంచినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 90 ఉన్న స్లీపర్ క్లాస్ కనీస తత్కాల్ ధరను రూ. 100కు, త్రీటైర్ ఏసీ కనీస ధరను కూడా రూ. 250 నుంచి రూ. 300కు పెంచనున్నారు. అయితే తత్కాల్‌లో సెకండ్ క్లాస్ టికెట్ల ధరలను పెంచటం లేదని అధికారులు తెలిపారు.