భారీగా టీచర్ పోస్టుల ఖాళీలు | teacher vacancies in AP, Telangana | Sakshi
Sakshi News home page

భారీగా టీచర్ పోస్టుల ఖాళీలు

Published Tue, Nov 22 2016 9:54 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

భారీగా టీచర్ పోస్టుల ఖాళీలు - Sakshi

భారీగా టీచర్ పోస్టుల ఖాళీలు

- ఏపీలో 19,468.. తెలంగాణలో 13,049 ఖాళీలు
లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలోని పాఠశాలల్లో మౌలికవసతుల కొరతతో పాటు బోధన సిబ్బంది పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఎంపీలు కొత్తపల్లి గీత, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నంది ఎల్లయ్య అడిగిన వేర్వేరు ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.

2016, మార్చి 31 నాటికి ఏపీలో 19,468 టీచర్ పోస్టులు, తెలంగాణలో 13,049 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే 9, 10 తరగతులకు సంబంధించి ప్రభుత్వ సెకండరీ పాఠశాలల్లో ఏపీలో 5,056, తెలంగాణలో 3,144 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement