
పోలవరంతో ఏపీలో 276 గ్రామాల మునక: జవదేకర్
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని 276 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభకు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు, ఒడిశాలోని ఎనిమిది గ్రామాలు కూడా ముంపునకు గురికావచ్చని పేర్కొంది. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని 3,427.52 హెక్టార్ల అటవీ ప్రాంతం ముంపునకు గురవుతుందని అంచనా వేసినట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.