తండ్రి ముందే కూతురిపై అత్యాచారం..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి ముందే దుండగులు అతని 16 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశారు. ఈ కీచక ఘటన శనివారం బలియాలోని రేవ్తీ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితులు గ్రామానికి చెందిన రాహుల్, దేవంత్, బీమ్, రాజాలు బాలికను ఆమె తండ్రి, మామ ముందే అత్యాచారం చేశారని బలియా పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులు అరెస్టు చేశామని, విచారణ జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. బాలికకు వైద్య పరీక్షలు జరిపించామని రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని అవి రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.