పాలసీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: శాసనసభ్యులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుపై సుప్రీం కోర్టు విచారణలో ఉన్న పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నివేదించగా సుప్రీం కోర్టు ఇందుకు నిరాకరించింది. అయితే తెలంగాణ చేసిన మరో వినతి మేరకు హౌసింగ్ పాలసీ మార్పునకు అనుమతించిం ది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వద్దకు సంబంధిత పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది.
శాసనసభ్యులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించగా.. వీరికి ఎందుకు ఇవ్వాలంటూ కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ నేపథ్యం లో ఇళ్ల స్థలాలు ఇదివరకే ఉన్నవారికి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నిచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ కేసును తాము ఉపసంహరించుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం తరపున సీని యర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించగా.. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది దత్త,గుంటూరు ప్ర భాకర్, సొసైటీల తరపున సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ వ్యతిరేకించారు.
జస్టిస్ ఠాకూర్ జోక్యం చేసుకుంటూ హైకోర్టు తీర్పు సరిగానే ఉంది కదా అని వ్యాఖ్యానించారు. అందరికీ లభించాలన్నది తమ అభిమతమని, వారసత్వంగా సంక్రమించిన భూములున్న వారు ఈ లెక్కన స్థలం పొందే అవకాశం కోల్పోతారని వాదించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకుంటే తమ ప్ర యోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నా రు. హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వానికి డబ్బులు కూ డా చెల్లించాయని వివరించారు. సుప్రీంకోర్టు వీరి వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్ ఉపసంహరణకు నిరాకరించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ విధానంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా కోర్టు అనుమతించింది. విచారణలో ఉన్న కేసులో ఏపీ సర్కారును ప్రతివాదిగా కొనసాగేందుకు కూడా అనుమతించిం ది. అన్ని పక్షాల స్పందనలు, ప్రతిస్పందనలు అందిన తరువాత విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం పేర్కొంది.
ఇళ్ల స్థలాల కేసు ఉపసంహరణకు సుప్రీం నో
Published Thu, Mar 31 2016 4:43 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement