తొలి పింఛన్‌కు బ్యాంకుకు వెళ్లక్కర్లేదు
న్యూఢిల్లీ: పదవీ విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తొలిసారి పింఛను అందుకోడానికి కూడా ఇకపై బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) ఉద్యోగి ప్రతిని ఇకనుంచి పదవీ విరమణ పొందే సమయంలోనే అందజేస్తామని సిబ్బంది, శిక్షణ విభాగం వెల్లడించింది. గతంలో పీపీఓ ఉద్యోగుల ప్రతి కూడా బ్యాంకుకు వస్తే వారు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలోనే పీపీఓ ప్రతిని కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.