2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యుల సమావేశంలో అధిష్టానం తమకు మార్గనిర్దేశం చేసిందన్నా రు. బుధవారం లక్ష్మణ్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం నుంచి ఆశిం చినంత సాయం అందడం లేదని టీఆర్‌ఎస్ నేతలు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ సమక్షంలోనే.. కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలా సహాయపడుతోందని, పలు పథకాలల్లో పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోందని సీఎం కేసీఆర్ బహిరంగానే చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర ం నుంచి అందుతున్న నిధుల్లో చాలా వరకు కింది స్థాయి వర్గాలకు చేరడం లేదని, దారిమళ్లుతున్నాయ న్నారు.
సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్నట్టు చెప్పారు. అసోం స్ఫూర్తితో 2019లో రాష్ట్రంలో అధికారం కోసం కృషి చేస్తామని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా మహారాష్ట్రతో నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ఒప్పందం కుదుర్చుకుంద ని లక్ష్మణ్ మండిపడ్డారు. ఎన్‌హెచ్-44 పరిధిలో కర్నూల్-హైదరాబాద్-నిజామాబాద్-ఆదిలాబాద్‌లను ఇండస్ట్రియల్ కారి డార్లుగా గుర్తించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు, రాష్ర్టంలో ఐఐఎం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి జవదేకర్‌కు వినతిపత్రాలు అందించినట్టు ఆయన తెలిపారు.