ఇండియన్ జర్నలిస్టుల యూనియన్
సాక్షి, హైదరాబాద్: హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాలో వార్తా సేకరణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు క్రూరంగా దాడి చేయడాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారని ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్ , జర్నలిస్టు నాయకుడు కె. అమరనాథ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన పోలీసు అధికారులను హర్యానా ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులపై పోలీసుల దాడి తగదు
Published Wed, Nov 19 2014 12:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement