పింప్రి, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ సంచులపై పుణే కార్పొరేషన్ సంపూర్ణ నిషేధం విధించినా, అమలు మాత్రం సాధ్యం కావడం లేదు. వీటిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మొదట్లో ప్రకటనలు చేసి న అధికారులు తదనంతరం తనిఖీలు నిర్వహిం చడం మానేశారు. దుకాణాల్లో క్యారీ బ్యాగులను తనిఖీ చేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడం కార్పొరేషన్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వర కు దొంగచాటుగా చెలామణి అవుతున్న క్యారీ బ్యాగులు ఇక మీదట విచ్చలవిడిగా వినియోగమయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా డ్రైనేజీలు ప్లాస్టిక్ సం చులతో నిండిపోతాయి నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. పుణేలో ప్రతి రోజు రెండువేల టన్నుల చెత్త పోగవుతోంది. చెత్తలో అధికంగా ప్లాస్టిక్ బ్యాగులు ఉండడం వల్ల వ్యర్థాలను వేరుచేయడం ఇబ్బందిగా మారిందని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు.
నిలిచిఅపోయిన తనిఖీలు
ప్రస్తుతం కార్పొరేషన్ వద్ద సిబ్బంది కొరత వల్ల ప్లాస్టిక్ సంచుల తనిఖీలకు వెళ్లడం లేదు. 50 మైక్రాన్లల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించారు. వీటిని ఉపయోగించిన వారి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సుమారు రూ.12 లక్షలు వసూలు చేసింది. సిబ్బంది కొరత వల్ల నాలుగు నెలలుగా తనిఖీలు నిలిపి వేయడంలో వసూళ్లు కూడా తగ్గిపోయాయి. జనవరిలో 1,994 సంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్ సంచు లు ఉపయోగించినట్టు తేలింది.
యథేచ్ఛగా ప్లాస్టిక్ సంచుల వినియోగం
Published Sat, Jul 12 2014 11:15 PM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM
Advertisement