సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి ఇప్పటికిప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ కార్యకలాపాలను తీసుకురావద్దని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్రాల్లో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు ఎంతమేరకు ఆదాయం వచ్చేదో ఆమేరకు ఇప్పుడు రావడం లేదని, ఈ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ ఎంపవర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌ను తీసుకువాలని ప్రస్తుతం చర్చ జరుగుతోందని, దానికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అంటే రాష్ట్రాల నిర్ణయాధికారాల్లో కేంద్రం కల్పించుకోవడమే అవుతుందని ఈటల అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు కేంద్ర పన్నులతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయన్నారు. ఇప్పుడు వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చి వినియోగదారులకు అధిక భారం కలిగించవద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment