జీఎస్టీపై అవసరమైతే న్యాయపోరాటం
33 అభ్యంతరాలు తెలిపాం: ఈటల
సాక్షి, నిజామాబాద్: జీఎస్టీ అమలులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణన లోకి తీసుకోకుండా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మంగళవారం నిజామాబాద్‌లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ పన్ను విధానంపై రాష్ట్రం తరఫున 33 అభ్యంతరాల తో కూడిన నివేదికను జీఎస్టీ కౌన్సిల్‌కు అంద జేశామన్నారు. బీడీ, గ్రానైట్, ఎరువులు, వ్యవ సాయ యంత్రపరికరాలపై 18 శాతం పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తు న్నామన్నారు.
మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజె క్టులు, రహదారుల నిర్మా ణం వంటి అభివృద్ధి పనులపై జీఎస్టీ భారం అధికంగా పడుతోందని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.9 వేల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపే నాటికి ఆయా వస్తుసేవలపై విధించే పన్ను రేట్లు బహిర్గతం కాలేదని ఓ ప్రశ్నకు సమాధా నంగా చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా జీఎస్టీని అమలు చేస్తే రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఏ మంత్రి వెళితే ఏంటీ: జీఎస్టీ సమావే శానికి తనకు బదులు మంత్రి కేటీఆర్ వెళ్ల నుండటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఈటల తోసిపుచ్చారు. మంత్రులు ఎవరు వెళ్లినా రాష్ట్ర అభిప్రాయాలనే వ్యక్తం చేస్తారన్నా రు. ఈనెల 10న శ్రీరాంసాగర్‌లో జరిగే సభకు ఇన్‌చార్జిగా ఉన్నందుకే తాను ఆ సమావేశానికి వెళ్లలేకపోతున్నానన్నారు.కాగా, గత ప్రభుత్వా లు సాగునీటి రంగాన్ని విస్మరించడంవల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నా రని మంత్రి పోచారం ఆరోపించారు.