బుధవారం ఢిల్లీలో జైట్లీని కలసిన అనంతరం బయటకు వస్తున్న మంత్రి ఈటల, కొప్పుల
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో రైతులకోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వ్యవసాయ పెట్టుబడి పథకానికి అవసరమైన నగ దు నిల్వలను సమకూర్చాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థి క మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభు త్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ బుధ వారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలసి వ్యవసాయ పెట్టుబడి పథకం వివరాలందించారు. ఈ పథకం కింద రాష్ట్రం లో సాగులో ఉన్న ప్రతి ఎకరానికి రైతులకు రూ.4 వేలు చెక్కుల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అయితే ఈ పథకం కింద చెక్కులు తీసుకువచ్చే రైతులకు ఇచ్చేందుకు బ్యాంకుల్లో తగిన స్థాయిలో నగదు నిల్వ లు లేవని ఇటీవల నిర్వహించిన సమావేశంలో బ్యాంకర్లు రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.
ఈ పథకానికి నగదు నిల్వ లు తప్పనిసరైన నేపథ్యంలో కేంద్రం ఆ దిశగా ఏర్పాట్లు చేయా లని జైట్లీని కోరినట్టు సమావేశం అనంతరం పోచారం మీడియాకు తెలిపారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతుకు ఎన్ని ఎకరాలు ఉందన్న విషయాన్ని భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా సేకరించాం. దాని ప్రకారం 71,70,000 వేల మంది రైతుల వద్ద 1,42, 12,870 ఎకరాలు ఉన్నట్టు లెక్కలు తేలాయి. దీనికి ఒక్క వర్షాకాల పంటకే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని తేలింది. రెండో పంటకు కూడా రైతులకు పెట్టుబడి ఇస్తాం. రైతులకు చెక్కు ల రూపం లో నగదు ఇవ్వాలని నిర్ణయించినందున, దీనికి సరి పడా కరెన్సీ నిల్వలు ప్రస్తుతానికి బ్యాంకుల్లో లేవు. నగదు నిల్వలు సమకూరిస్తేనే పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతామని బ్యాంకర్లు తెలిపారు. దీంతో జైట్లీని కలసి సమస్యను వివరించాం. ఆయన సానుకూలంగా స్పం దించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు’అని పోచారం వివరించారు. మే 1 నుంచి 10వ తేదీవరకు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో తిరిగి చెక్కులు పంపిణీ చేస్తారన్నారు.
జీఎస్టీలోకి ఆ ఉత్పత్తులను ఒప్పుకోం..
వస్తు, సేవల పన్ను పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వచ్చే నెల ఒకటిన కేంద్రం 2018–19 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో కొన్ని వస్తువుల పన్ను సరళిలో మార్పులు కోరుతామని ఈటల తెలిపారు. గోదావరి నదిలో మురుగు నీరు చేరకుండా శుద్ధి చేసేందుకు రూ. 36 కోట్ల నిధులు ఇవ్వా లని మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభు త్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై వారు బుధవారం ఢిల్లీ లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీని కలసి ప్రతిపాదనలను సమర్పించారు. కాగా, తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఈటల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment