కాలేజ్ స్టాఫ్ తో అసభ్య ప్రవర్తన:విద్యార్థుల సస్పెన్షన్ | Three final year students suspended for eve-teasing | Sakshi
Sakshi News home page

కాలేజ్ స్టాఫ్ తో అసభ్య ప్రవర్తన:విద్యార్థుల సస్పెన్షన్

Published Sat, Jan 3 2015 9:15 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

కాలేజ్ స్టాఫ్ తో అసభ్య ప్రవర్తన:విద్యార్థుల సస్పెన్షన్ - Sakshi

కాలేజ్ స్టాఫ్ తో అసభ్య ప్రవర్తన:విద్యార్థుల సస్పెన్షన్

జోథ్ పూర్(రాజస్థాన్): మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసిన ఘటన జోథ్ పూర్ లోని ఎంబీఎమ్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. ఆ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న ముగ్గురు వేర్వేరు బ్యాచ్ లకు చెందిన విద్యార్థులు మహిళా ఉద్యోగినితో పాటు కొంతమంది విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేస్తూ పట్టుబట్టారు. దీనిపై స్పందించిన కళాశాల యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.

 

కళాశాల నుంచి బహిష్కరించబడిన వారిలో కేమ్ రాజ్ మీనా(ఎలక్ట్రానిక్స్), మోహిత్ కుమార్(సివిల్), శైలేష్ మీనా(మెకానికల్) విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనపై వారి తల్లి దండ్రులకు సమాచారం అందివ్వడమే కాకుండా, పోలీస్ ఫిర్యాదు చేసినట్లు కళాశాల క్రమశిక్షణా కమిటీ పేర్కొంది.  ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు పోలీసుల అదుపులో ఉండగా.. మరో విద్యార్థి ఆ కేసును బయటపడేందకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement