ఆ సీఎం యాంటీ ఇండియన్
అగర్తల: త్రిపుర సీఎం మాణిక్ సర్కార్... పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లా మాట్లాడుతున్నారని తృణముల్ కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. ఓ పారిశ్రామిక సదస్సులో మాణిక్ సర్కార్ మాట్లాడుతూ.. ఇండియా పొరుగు దేశాలతో ఘర్షణ పడకుండా పెద్దన్న తరహాలో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. దీంతో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళలకు దిగారు.
సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీఎంసీ నేత సుశాంత్ చౌదరీ సీఎంను దేశద్రోహి అని వ్యాఖ్యానించారు. సీపీఎం దేశద్రోహ భావాలను వదులుకోలేకపోతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనిపై స్పందించిన సీపీఎమ్ నేత బిజన్ధర్ టీఎంసీ తీరును తప్పుబట్టారు. టీఎంసీ తమను అప్రతిష్టపాలు చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఉడీ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.