టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం సభలో చర్చకు రానుంది.
రాష్ట్రానికి ఆర్థిక సాయంపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఏపీలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ఆర్థిక సహా యాన్ని అందివ్వాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం సభలో చర్చకు రానుంది.
గతంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నప్పుడు అందులో 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా కేంద్రం గుర్తించిందన్నారు. ఈ 9 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ కూడా రావడం లేదన్నారు.