![Two Maoists Were Killed in Encounter - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/14/naxals%20copy.jpg.webp?itok=lgMa9liJ)
ప్రతీకాత్మక చిత్రం
చత్తీస్‌గఢ్: పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన కాంకర్ జిల్లా తడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పి. సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా రిజర్వ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాసేపటి తర్వాత అవతలి వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం మొదట కాల్పులు ప్రారంభమైన చోటుకి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వాటితో పాటు రెండు ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులు, ఒక .303 రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీఐజీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment