
ఢిల్లీ: తాను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారని, ఆ గందరళగోళంలో తన పిస్టల్ కింద పడిపోయినట్లు పాక్ చేతికి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ తెలిపారు. ఈ మేరకు కొత్తగా విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. నన్ను నేను రక్షించుకోవడానికి పరుగులు తీశానని, అల్లరి మూక తన వెంట పడినట్లు పేర్కొన్నారు.
వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారని, అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు వచ్చారని, వాళ్లే నన్ను మూక నుంచి రక్షించినట్లు అభినందన్ తెలిపారు. తర్వాత వారు తనను వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లారు.. అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నారు. అక్కడే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని చెప్పారు. నా విషయంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్‌గా వ్యవహరించిందని అభినందన్ వెల్లడించారు.