!['మోదీని అదే అడగాలనుకుంటున్నా'](/styles/webp/s3/article_images/2017/09/4/81465880109_625x300.jpg.webp?itok=J6K0ij3m)
'మోదీని అదే అడగాలనుకుంటున్నా'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఓటమిని జీర్ణించుకోలేకే తమ పాలన అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. 'ఓటమిని తట్టుకోలేకే పార్లమెంట్ లో తమను సోనియా గాంధీ అడ్డుకుంటున్నారని ప్రధాని మోదీ అంటున్నారు. ఢిల్లీలో ఓటమిని జీర్ణించుకోలేకే ఢిల్లీ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారా అని మోదీని అడగాలనుకుంటున్నా'ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
'ఉడ్తా పంజాబ్' సినిమా వివాదం పైనా కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమాపై కోర్టు ఇచ్చిన తీర్పు మోదీ పాలన పెరిగిన అసహనంకు గట్టి చెంపపెట్టుగా ఆయన వర్ణించారు. ఒక్క కట్ తో రెండు రోజుల్లో 'ఉడ్తా పంజాబ్' సినిమాకు కొత్త సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‌సీని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.