డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు కరోనా నెగటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. రాష్ట్ర మంత్రి సాత్పాల్ మహరాజ్‌కు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం త్రివేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మరో ముగ్గురు మంత్రులతో పాటు సాత్పాల్ మహరాజ్ కూడా పాల్గొన్నారు. దీంతో ముఖ్యమంత్రి రక్త నమూనాలను కోవిడ్ నిర్ధారణకు పంపగా నెగటివ్ వచ్చింది.
ఇక కేబినెట్ భేటీలో పాల్గొన్న మిగతా మంత్రులు కోవిడ్ పరీక్షలు చేయించుకోకపోవడం గమనార్హం. డెహ్రాడూన్ జిల్లా ఆరోగ్య విభాగం అధికారులు తాము సాత్పాల్‌తో కాంటాక్ట్ అయ్యే అవకాశాలు లేవని, తమకు కరోనా రిస్కు లేదని చెప్పారని వెల్లడించారు. అందుకనే పరీక్షలు చేయించుకోలేదని మంత్రులు మదన్ కౌశిక్, హరాక్ సింగ్ రావత్, సుబోధ్ యునియాల్ తెలిపారు. అయినప్పటికీ కేంద్రం మార్గదర్శకాల ప్రకారం జూన్ 1న రెండు వారాలపాటు స్వీ య నిర్బంధంలోకి వెళ్తున్నట్టు చెప్పారు. కానీ, మూడు రోజులు కాగానే గురువారం నుంచి యాధావిధిగా విధులకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment