కేంద్రం అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు
ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. అక్కడ కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించగా, దానిపై హైకోర్టు స్టే విధించి బల నిరూపణకు అవకాశం ఇవ్వడం, మళ్లీ బల నిరూపణ మీద కూడా స్టే రావడం లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.
కాగా, అసలు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాలుచేస్తూ డెహ్రాడూన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిమీద తమ వాదనలను వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కోర్టును మరింత సమయం కోరింది. కానీ, తాజాగా బుధవారం నాటి విచారన సందర్భంగా కేంద్రానికి గడువు ఇచ్చేందుకు డెహ్రాడూన్ హైకోర్టు నిరాకరించింది. తక్షణం వాదనలు వినిపించాలని ఆదేశించినట్లు సమాచారం.