చెప్పుకోలేని చోట కొరికేసింది
Published Thu, Jun 5 2014 8:22 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM
ఆమెకు కోపం వచ్చింది. అలిగి కూచుంది. ఆయనకు పట్టుదల పెరిగింది. నువ్వు వండకపోతే నేనే వండుకుంటాను అంటూ వంటింట్లోకి వెళ్లాడు. నా వంటింట్లోకి నువ్వు వెళ్లొద్దంటూ ఆమె అడ్డం పడింది. అంతే ఇద్దరూ బాహాబాహీ ముష్టా ముష్టీ కొట్టుకున్నారు.
ఆ పోరాటంలో ఆయన కట్టుకున్న టవల్ జారిపోయింది. ఆయన 'దివ్యమంగళరూపాన్ని' చూసిన ఆమెకు నషాళానికి అంటింది. అంతే కసక్కున కొరకరాని చోట కొరికేసింది. ఇదంతా మే 4 న మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలోని పాగ్రా గ్రామంలో జరిగింది.
ఆయన పేరు జితేన్ పటేల్, ఆమె పేరు ఉమా పటేల్. వాళ్లిద్దరూ రెండేళ్లు ప్రేమించుకుని పెళ్లాడారు. పెళ్లి తరువాత ప్రేమ వికటించి ప్రేమ గాట్ల నుంచి కోపపు కాట్ల దాకా ఎదిగింది. అయితే బయట చెప్పుకుంటే పరువునష్టమని జితేన్ నెల రోజుల పాటు తనలోనే దాచుకున్నాడు. ఇప్పుడు ఆయనకు మొత్తం చీము పట్టేసింది. దాంతో తప్పనిసరై ఆస్పత్రికి వెళ్లడంతో అంతా బట్టబయలైంది.
ఇప్పుడు జితేన్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఉమ కేసులను ఎదుర్కొంటోంది.
Advertisement
Advertisement