సుపరిపాలనకు మారుపేరు అయిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న ఇవ్వటం ఆ అవార్డుకే గౌరవమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
న్యూఢిల్లీ : సుపరిపాలనకు మారుపేరు అయిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న ఇవ్వటం ఆ అవార్డుకే గౌరవమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్యాకు కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. మాలవ్యాకు భారతరత్న ఇవ్వటం తమకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామని వెంకయ్య నాయుడు అన్నారు.