భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి నేడు భారతరత్న ప్రదానం చేయనున్నారు.
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి నేడు భారతరత్న ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రణబ్ స్వయంగా వాజ్పేయి నివాసానికి వెళ్లి ఈ అవార్డును అందించనున్నారు.
గత కొంతకాలంగా వాజ్పేయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. దాంతో రాష్ట్రపతే స్వయంగా వాజ్పేయి ఇంటికి వెళ్లి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వనున్నారు. కాగా మదన్ మెహన్ మాలవ్యకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.