'ఓఆర్ఓపీ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాం' | venkaiah statement on one rank one pension problem | Sakshi
Sakshi News home page

'ఓఆర్ఓపీ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాం'

Published Sat, Sep 5 2015 7:22 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

'ఓఆర్ఓపీ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాం' - Sakshi

'ఓఆర్ఓపీ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాం'

న్యూఢిల్లీ: నలభై ఏళ్లుగా పెండింగులో ఉన్న ఒకే ర్యాంకు - ఒకే పింఛన్ సమస్యను నరేంద్రమోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించిందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకే ర్యాంకు - ఒకే పింఛన్ ఆర్థికంగా భారం అవుతుందని చెప్పారు. సైనికులు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

పరిష్కారం కాని బంగ్లాదేశ్ భూబదలాయింపు, జ్యూడీషియల్ కమిషన్ సమస్యలను మోదీ అధికారంలోకి వచ్చాక పరిష్కరించారన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు సమావేశాలు తిరిగి నిర్వహించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement