venkaih naidu
-
వెంకయ్యకు రామకృష్ణ లేఖ
సాక్షి, విజయవాడ : టీడీపీ రాజ్యసభ సభ్యులు ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడుకి లేఖ రాశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ప్రజాస్వామిక విలువలను దిగజార్చారని లేఖలో మండిపడ్డారు. పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశం జరపకుండా పార్టీ మారడం.. వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రొద్బలంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించి స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో పార్టీ ఫిరాయింపుల గురించి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి గాను.. ఫిరాయించిన తక్షణమే పదవి పోయేలా చట్టం తీసుకురావాలంటూ వెంకయ్య చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజాస్వామ్యవాదులంతా హర్షం వ్యక్తం చేశారన్నారు. అలాంటిది.. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉండి ఫిరాయింపుదార్లకు తలపులు తెరవడాన్ని జనాలు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. వెంకయ్యకే గనక చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేసి పదవుల నుంచి తొలగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. లేదంటే వెంకయ్య చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రజాస్వామిక విలువలను కాపాడి.. ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలని రామకృష్ణ కోరారు. (చదవండి: టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం) -
ప్రజాస్వామ్య పరిరక్షణ పార్టీల బాధ్యత
-
రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టాడు
-
ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ, ఆత్కూరు పర్యటనల నిమిత్తం న్యూఢిల్లీ నుంచి భారత వాయుసేన విమానంలో ఉదయం 10.10 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు, గడ్కరీకి రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు. ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, మాగంటి వెంకటేశ్వరరావు, కంభంపాటి హరి బాబు, గోకరాజు గంగరాజు, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, డీజీపీ ఎన్.సాంబశివరావు, ప్రొటోకాల్ కార్యదర్శి శ్రీకాంత్, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్‌సవాంగ్, డీసీపీ డాక్టర్ గజరావుభూపాల్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.మధుసూదనరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్ తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం పాతటెర్మినల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వాగత శిబిరంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సీఎం, గవర్నర్, కేంద్ర మంత్రి నితిన్గడ్కరీతో కలిసి ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ బయలుదేరివెళ్లారు. గవర్నర్‌కు స్వాగతం తొలుత హైదరాబాద్ నుంచి ట్రూజెట్ విమానంలో గవర్నర్ నరసింహన్ గన్నవరం చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ బి. లక్ష్మీకాంతం, డీసీపీ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తదితరులు స్వాగతం పలికారు. -
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు
-
రోహిత్ ను గాంధీతో పోల్చడం సిగ్గుచేటు
♦ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ♦ విద్యార్థి ఆత్మహత్యను నేతలు రాజకీయం చేస్తున్నారు ♦ దేశవిద్రోహులకు వత్తాసు పలుకుతున్నారు ♦ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మేడ్చల్ రూరల్ : రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని, కొంతవుంది అతడిని గాంధీతో పోలుస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వుంత్రి వెంకయ్యునాయుుడు వివుర్శించారు. హైదరాబాద్‌లోని వివిధ యూనివర్సిటీల్లో గత ప్రభుత్వాల హయాంలో 11మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎలాంటి రాజకీయం చేయని వారు ఇప్పుడెందుకు రాజకీ యం చేస్తున్నారో? అందరికీ తెలుసన్నారు. మేడ్చల్ వుండలంలోని మైసవ్ముగూడ వుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి శనివారం ఆయు న వుుఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వూట్లాడుతూ దేశంలోని కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ యుూనివర్సిటీ వి ద్యార్థులు దేశ విద్రోహులైన అఫ్జల్‌గురు, యూకుబ్ మెమె న్, వుక్బూల్భట్ వంటి వారికి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారికి వి ద్యార్థి సంఘాలు, విద్యార్థులే కాకుం డా కొంతవుంది రాజకీయు నాయుకులు సైతం తొత్తులుగా వూరుతున్నారన్నారు. మరోవైపు ‘భారత్ వూతా కీ జై’ అంటే అభ్యంతరం వ్య క్తం చేయుడం చూస్తున్నావున్నారు. యుూని వర్సిటీల్లో విద్యార్థులు ఇలాంటి వా టిని పట్టించుకోకుండా తవు చదువులపై శ్రద్ధ చూపి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు కావాల్సింది ఉద్యవూలు కావ ని, చదువులు కావాలన్నారు. ప్రస్తు తం కొన్ని యుూనివర్సిటీల్లో కొంతవుంది బీఫ్ ఫెస్టివల్, మరో ఫెస్టివల్ జరపడం సరికాదని, వర్సిటీల్లో జరగాల్సింది ఎడ్యుకేషన్ ఫెస్టివల్ అన్నారు. ఈ - లైబ్రరీని ప్రారంభించిన వెంకయ్యనాయుడు కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన శనివారం ఈ - లైబ్రరీని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అధ్యాపకులను సత్కరించారు. అనంతరం వుల్కాజిగిరి ఎంపీ, వుల్లారెడ్డి కళాశాలల చైర్మన్ వుల్లారెడ్డి కేంద్రవుంత్రి వెంకయ్యునాయుుడిని ఘనంగా సన్మానించారు. కార్యక్రవుంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రవుణ, మేడ్చల్ ఎంపీపీ విజయులక్ష్మి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ వుల్లారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, వుండల టీడీపీ, బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కళాశాల సెక్రటరీ వుహేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
'ఓఆర్ఓపీ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాం'
న్యూఢిల్లీ: నలభై ఏళ్లుగా పెండింగులో ఉన్న ఒకే ర్యాంకు - ఒకే పింఛన్ సమస్యను నరేంద్రమోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించిందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకే ర్యాంకు - ఒకే పింఛన్ ఆర్థికంగా భారం అవుతుందని చెప్పారు. సైనికులు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరిష్కారం కాని బంగ్లాదేశ్ భూబదలాయింపు, జ్యూడీషియల్ కమిషన్ సమస్యలను మోదీ అధికారంలోకి వచ్చాక పరిష్కరించారన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు సమావేశాలు తిరిగి నిర్వహించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా తెలిపారు. -
అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే: వెంకయ్య
హైదరాబాద్: సీమాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉందని, అది కాద నలేని వాస్తవమని అన్నారు. అయినప్పటికీ టీడీపీ- బీజేపీ కూటమి తప్పక విజయం సాధిస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమికి స్థానిక ఎన్నికల్లో వచ్చిన దానికన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని బుధవారం విలేకరులకు తెలిపారు. సాధారణ ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తెలంగాణలో హంగ్ వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 300 వరకు సీట్లు వస్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి దేశహితం కోరి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తే తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సరళిపై నరేంద్ర మోడీ ఆరా తీశారు. బుధవారం వెంకయ్య నాయుడుకు ఫోను చేసి తాజా పరిణామాలపై చర్చించారు. -
విభజన అంటే గీత గీయడం కాదు
సాక్షి, అనంతపురం: ‘రాష్ట్రాన్ని విడగొట్టడమంటే గీత గీయడం కాదు. సీమాంధ్రకున్యాయం చేయకుండా విభజన విషయంలో బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ముందుకెళ్లద’ని ఆ పార్టీ జాతీయ నేత ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ‘మోడీ ఫర్ పీఎం’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాయలసీమ తరతరాలుగా కరువుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విభజన బిల్లులో వాటికి పరిష్కార మార్గాలు చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. ‘కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోంది. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కిరణ్ సీడబ్ల్యూసీ సమావేశంలో గట్టిగా ఎందుకు వ్యతిరేకించలేకపోయారు? ఇన్నాళ్లూ పట్టించుకోకుండా మరో 68 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంద’ని దుయ్యబట్టారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతివ్వాలని కొందరు నేతలు తమ వద్దకొచ్చినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో తాము అంగీకరించలేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపేందుకైనా మద్దతివ్వాలని మరికొందరు కోరారని, అయితే.. సీమను విడదీసి అపఖ్యాతి మూటగట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పదేళ్ల ట్యాక్స్ హాలిడే ఇచ్చారని, ఇదే తరహాలో రాయలసీమలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో అస్థిరత నెలకొందని, స్థిరమైన ప్రభుత్వం రావాలంటే మోడీని ప్రధాని చేయడమే ఏకైక మార్గమని అన్నారు. కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలతో దేశాన్ని సర్వనాశనం చేసింద ని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే అవినీతి పరులను జైలుకు పంపుతామని ఎన్నికల ముందు ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్... ఇప్పుడు అవినీతి కాంగ్రెస్‌తో చేతులు కలిపి అందలమెక్కారని, అవినీతిపరుల చిట్టా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. వెంకయ్యతో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న వెంకయ్య నాయుడుని విడివిడిగా కలిసి చర్చలు జరిపారు. విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేస్తుండటంతో సమైక్యంగా వుంచే దిశలో మద్దతు కోరేందుకు వెంకయ్య నాయుడుని కలిశామని సునీత, కే శవ్ వెల్లడించారు. కాగా.. సమైక్యం కోసం మద్దతు కోరేందుకే అయితే కలిసిగా కాకుండా విడివిడిగా ఎందుకు కలిశారన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.