న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టంలో సవరణలపై మంగళవారం రాత్రి లోక్ సభలో ఓటింగ్ ప్రారంభమయ్యింది. చట్టంలో మొత్తం తొమ్మిది సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిలో విపక్షాలు చేసిన కొన్ని సూచనలను ప్రభుత్వం పరిగణిలోకి తీసుకుంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు టీడీపీ మద్దతు తెలిపింది.
ఇదిలా ఉండగా తమ పార్టీ చేసిన సవరణలకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు మద్దతిస్తున్నట్లు బీజేడీ ప్రకటించింది. సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్(సామాజిక ప్రభావ అంచనా) పై విపక్షాల పట్టు పట్టినా.. ఆ తీర్మానం వీగిపోయింది.