ఎంపీ గవర్నర్కు సుప్రీం నోటీసులు | Vyapam Scam: Supreme Court Issues Notice to Centre, Madhya Pradesh Governor | Sakshi
Sakshi News home page

ఎంపీ గవర్నర్కు సుప్రీం నోటీసులు

Published Fri, Nov 20 2015 7:05 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM

ఎంపీ గవర్నర్కు సుప్రీం నోటీసులు - Sakshi

ఎంపీ గవర్నర్కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్కు నోటీసులు పంపించింది. వ్యాపం కుంభకోణంలో గవర్నర్ రామ్ నరేశ్కు కూడా భాగస్వామ్యం ఉందని, ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తున్నందున ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో స్పందన తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీంతోపాటు ఒక వేళ గవర్నర్ స్ధానంలో ఉండి అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైతే అతడిని తొలగించడానికి కావాల్సిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. సంజయ్ శుక్లా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement