'సీఎం తప్పుకోవాలి.. సుప్రీం విచారించాలి'
న్యూఢిల్లీ: తీవ్ర అవినీతి, ఘోర నేరాల కలయికగా వ్యాపం కుంభకోణాన్ని అభివర్ణించిన సీపీఎం.. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. ' కేసు విచారణ సజావుగా సాగేలా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పదవినుంచి తప్పుకోవాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి' అని ఆ పార్టీ పేర్కొంది.
ఢిల్లీలో జరిగిన రెండురోజుల పొలిట్బ్యూరో సమావేశం అనంతరం ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదలచేసింది. సీబీఐ విచారణకు ఆదేశించడంద్వారా వరుస మరణాలకు అడ్డుకట్టపడుతుందని, త్వరితగతిన నిజానిజాలు నిగ్గుతేల్చి దోషులకు శిక్షపడేలా చేయాలని కోరింది. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సహకరించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా తక్షణమే పదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేసింది.