'వ్యాపం' నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వ్యాపం కుంభకోణంలో దాఖలైన అన్ని చార్జీషీట్లను దర్యాప్తు పూర్తయ్యేవరకు భద్రంగా ఉంచాలని 'సిట్' ఆదేశించాలని సుప్రీంకోర్టును సీబీఐ అభ్యర్థించింది. వ్యాపం స్కామ్ లో దాఖలైన 185 కేసుల బదిలీకి సమయం పడుతుంది కాబట్టి నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని కోరింది.
సీబీఐ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యాపం కుంభకోణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.