న్యూఢిల్లీ: వ్యాపం కుంభకోణం కేసులపై పూర్తిస్థాయి దర్యాప్తు ఎప్పుడు ప్రారంభిస్తారని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులన్నింటినీ ఎప్పుడు తమ ఆధీనంలోకి తీసుకుంటారని అడిగింది. వ్యాపం కేసుల విచారణలో వాదించేందుకు న్యాయవాదిని ఎప్పుడు నియమిస్తారని ప్రశ్నించింది.
ఈ కేసు విచారణను తాము పర్యవేక్షించాలా, వద్దా అనే దానిపై వచ్చే శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వ్యాపం స్కామ్ పై విచారణను సుప్రీంకోర్టు... సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.
లాయర్ని ఎప్పుడు నియమిస్తారు?
Published Fri, Jul 24 2015 1:39 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement