- మార్పులు చేర్పులతో వడాల-కాసార్ వడవలి ప్రాజెక్టు
సాక్షి, ముంబై : కొద్దిరోజులుగా అటకెక్కిన వడాల-కాసార్ వడవలి (ఠాణే) మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఈ మార్గాన్ని పూర్తిగా ఎలివేటెడ్ (పై నుంచి) నిర్మించాలని ముందుగా తీసుకున్న నిర్ణయంలో కొద్ది మార్పులు చేశారు. ఈ మెట్రో మార్గాన్ని వడాల నుంచి కాపూర్‌బావుడీ వరకు భూగర్భం నుంచి, ఆ తర్వాత కాసార్‌వడవలి వరకు ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు తుది నివేదిక (డీపీఆర్)ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది.
అంచనా వ్యయం : ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.10 వేల కోట్లు అవుతుందని అంచనావేశారు. కానీ పెరిగిన సామగ్రి ధరలు, తీవ్ర జాప్యం కారణంగా వ్యయం తడిసి మోపెడైంది. ప్రస్తుతం అది రూ.22 వేల కోట్లకు చేరుకుంది. భూగర్భ మార్గం పనులకు వ్యయం ఎక్కువే అవుతోంది. ఈ ప్రాజెక్టులో జరిగిన మార్పుల వల్ల వడాల నుంచి కాసార్‌వడవలి వరకు మాత్రమే భూగర్భ మార్గం ఉండగా, మిగతాది ఎలివేటెడ్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు వ్యయం కొంతమేర తగ్గింది.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు...
వడాల-కాసార్‌వడవలి (ఠాణే) వరకు చేపట్టనున్న ఈ మెట్రో రైలు మార్గం పది చోట్ల మెట్రో-1 ప్రాజెక్టుకు కనెక్టివిటీ ఉంటుంది. కొన్ని చోట్ల మోనో రైల్వే స్టేషన్‌లతో కూడా కనెక్టివిటీ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రయాణికులకు ఏ రైలు ఎక్కాలన్నా ట్యాక్సీ లేదా ఆటోను గానీ ఆశ్రయించాల్సిన అవసర ముండదు.
ప్రస్తుతం నగరంలో సేవలు అందిస్తున్న వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైల్వే స్టేషన్‌లతో కూడా కనెక్టివిటీ చేయనున్నారు.
దూరం...: 30.8 కి.మీ. దూరం గల ఈ మార్గంపై మొత్తం 32 స్టేషన్‌లు ఉంటాయి. ఇందులో 26 స్టేషన్‌లు భూగర్భంలో, ఆరు స్టేషన్‌లు ఎలివేటెడ్ ఉంటాయి. ముంబై హద్దులో 20 స్టేషన్‌లు ఉండగా మిగతా స్టేషన్‌లు ఠాణే హద్దులో ఉంటాయి.
ఈ ప్రాజెక్టు రూట్..
వడాల, ఆణిక్, ప్రయదర్శిని ప్రాంతంలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వే కింది నుంచి కుర్లా, లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ), ఘాట్కోపర్ ఆ తర్వాత ఎల్బీఎస్ రోడ్డు మీదుగా ఠాణే దిశగా వెళుతుంది.
‘మెట్రో’ ప్రతిపాదనలు రెడీ
Published Sat, Aug 2 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM
Advertisement
Advertisement