Elevated way
-
ఎలివేటెడ్ రోడ్డుగా జీఎంఎల్‌ఆర్
సాక్షి, ముంబై : గోరేగావ్-ములుండ్ లింక్‌రోడ్ (జీఎంఎల్‌ఆర్) పూర్తిగా ఎలవేటెడ్‌గా నిర్మించనున్నారు. అయితే ఈ మార్గాన్ని తొలుత రోడ్డు మార్గంగా నిర్మించాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ భావించింది. అరేకాలనీ మీదుగా ఈ మార్గం వెళుతుండడంతో రోడ్డు నిర్మాణంలో భాగంగా 1,100 చెట్లను నరకాల్సి వచ్చింది. దీంతో పచ్చదనం కోల్పోవద్దన్న ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎలవేటెడ్ మార్గంగా నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకు గాను రూ.1,300 కోట్లు ఖర్చు అవుతున్నట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించిన సలహాదారులు తమ నివేదికను ఇటేవల సమర్పించారు. ఇటీవల బీఎంసీ గోరేగావ్‌లోని అరేరోడ్ను వెడల్పు చేసేందుకు ప్రతిపాదించింది. గోరేగావ్ నుంచి సాకివిహార్ వరకు నాలుగు లేన్ల దారిగా, తర్వాత ఇక్కడి నుంచి ములుండ్ వరకు ఎలవేటెడ్‌గా నిర్మించాలని నిశ్చయించింది. అయితే పర్యావరణ ప్రేమికులు ఈ ప్లాన్‌ను పూర్తిగా వ్యతిరేకించారు. ఇందులో భాగంగా అరేరోడ్ వద్ద దాదాపు 1,100 చెట్లను నరికి వేయాల్సి వచ్చింది. అంతేకాకుండా జంతువుల కదలికకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడ్డారు. కాగా, పర్యావరణ పరిరక్షణతోపాటు జంతువులకు కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ అడిషనల్ కమిషనర్, రోడ్ల విభాగపు అధికారి ఎస్వీఆర్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తుది డైజన్కు సంబంధించిన పనులు నిర్వహిస్తున్నారు. అయితే అరెకాలనీలో మొత్తంగా టన్నెల్‌ను నిర్మించాల్సిందిగా పర్యావరణ ప్రేమికులు సూచించారు. కానీ కార్పోరేషన్ అధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. టన్నెల్‌ను నిర్మించే బదులు ఎలవెటెడ్ను నిర్మించడం ద్వారా నిర్మాణ వ్యయం తగ్గించవచ్చని అధికారి అభిప్రాయపడ్డారు. ఈ గోరేగావ్-ములుండ్ లింక్‌రోడ్ నిర్మాణం నగరంలో 5వ ఈస్ట్, వెస్ట్‌ను కలుపుతుందని ఆయన తెలిపారు. 14 కి.మీ. రోడ్డు అరేకాలని, సాకివిహార్, భాందూప్ కాంప్లెక్స్ మీదుగా వెళ్లి ములుండ్‌లోని ఎల్బీఎస్ మార్గ్‌కు కలుస్తుంది. ఈ కొత్త ప్రణాళికపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలివేటెడ్ రోడ్ నిర్మాణంతో పిల్లర్లు ఇప్పుడు ఉన్న రోడ్డు కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయని, దీంతో అరే కాలనీలో రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని సామాజిక కార్యకర్త బీజు అగస్టీన్ డిమాండ్ చేశారు. -
మలి పరుగు
సాక్షి, ఉప్పల్: నగరవాసుల కలల మెట్రోరైలు వరుసగా రెండోరోజూ పరుగులు పెట్టింది. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాగోల్ మెట్రో డిపో నుంచి-సర్వేఆఫ్ ఇండియా వరకు రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గంలో సుమారు 20 కేఎంపీహెచ్ వేగంతో మొత్తం పదికిలోమీటర్లు(ఐదు ట్రిప్పులు) విజయవంతంగా రాకపోకలు సాగించినట్లు ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. ఈ మార్గంలో మెట్రోరైలుకు ఆగి ఉన్నప్పుడు, ఎలివేటెడ్ మార్గంలో పయనిస్తున్నప్పుడు మొత్తం 18 పరీక్షలను నిర్వహించామని, ఆయా పరీక్షలను రైలు విజయవంతంగా పాసైందని వెల్లడించారు. మళ్లీ సోమవారం ప్రయోగపరీక్ష(టెస్ట్న్)్ర ఉంటుందని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయా విడిభాగాలను సరఫరా చేసిన సంస్థలుఅన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించన తర్వాతనే భద్రతా సర్టిఫికెట్లు జారీ చేస్తాయని.. అప్పుడు ట్రయల్న్ ్రనిర్వహిస్తామన్నారు. 60 రోజులపాటు ట్రయల్న్.్ర. ప్రస్తుతం నాగోల్ మెట్రో డిపోలోని నాలుగు మెట్రోరైళ్లతోపాటు త్వరలో కొరియా నుంచి మెట్రోడిపోకు చేరనున్న మరో మూడు రైళ్లను అంటే మొత్తం ఏడు రైళ్లను ట్రయల్న్‌క్రోసం సన్నద్ధం చేస్తామని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. ట్రయల్న్‌న్రు నాగోల్-మెట్టుగూడా రూట్లో ఎనిమిదికిలోమీటర్ల మార్గంలో 60 రోజులపాటు నిర్వహిస్తామన్నారు. మెట్రోరైలుకు నిర్వహించిన సాంకేతిక పరీక్షలివే.. పట్టాలపై రైలు నిలిపి ఉన్నపుడు నాగోల్ డిపోలో స్టాటిక్ టెస్ట్-1 ఎలివేటెడ్ మార్గంలో పరుగులతీస్తున్నపుడు స్టాటిక్ టెస్ట్స్-2,3,4 ఎలివేటెడ్ మార్గంలోని ప్రధాన మార్గం(పట్టాలమార్గం) సామర్థ్యాన్ని పరీక్షించడం పరుగులు తీస్తున్నపుడు ప్రొపల్షన్ సిస్టం పనితీరు మెట్రో రైలు బ్రేకుల పనితీరు శబ్దం, కూత, కదుపుల తీరుతెన్నులు రైలులో అంతర్గత సమాచార వ్యవస్థ పనితీరు రైలు పరుగెడుతున్నపుడు మొత్తం గమనం తీరుతెన్నుల రికార్డింగ్ {పయాణికులకు సమాచారం అందించే వ్యవస్థ, సీసీటీవీలు, రైలుకున్న హెడ్లైట్లు(10), కంప్రెసర్(11), రైలు ఆగినప్పుడు, పరుగులు తీస్తున్నపుడు ఆటోమేటిక్‌గా మూసుకొని, తెరుచుకొనే డోర్ల(12) పనితీరు రైలులో వెంటిలేషన్, ఎయిర్‌కండిషన్ వ్యవస్థ, విపత్తులు సంభవిస్తే రైలులో వివిధ వ్యవస్థ(14)ల పనితీరు. రీసెర్చ్ డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం ఆసిలేషన్, అత్యవసర బ్రేకుల పనిచేసే విధానం. సిగ్నలిగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరు. ఓవర్‌హెడ్ ట్రాక్షన్ సిస్టం(విద్యుత్ గ్రహించే తీరు) రిలయబిలిటీ(విశ్వసనీయత), అవైల్యబిలిటీ(సానుకూలత), మెయిన్టేనబిలిటీ(నిర్వహణ సామర్థ్యం), భద్రతకు సంబంధించిన ఇతర పరీక్షలు. -
‘మెట్రో’ ప్రతిపాదనలు రెడీ
- మార్పులు చేర్పులతో వడాల-కాసార్ వడవలి ప్రాజెక్టు సాక్షి, ముంబై : కొద్దిరోజులుగా అటకెక్కిన వడాల-కాసార్ వడవలి (ఠాణే) మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఈ మార్గాన్ని పూర్తిగా ఎలివేటెడ్ (పై నుంచి) నిర్మించాలని ముందుగా తీసుకున్న నిర్ణయంలో కొద్ది మార్పులు చేశారు. ఈ మెట్రో మార్గాన్ని వడాల నుంచి కాపూర్బావుడీ వరకు భూగర్భం నుంచి, ఆ తర్వాత కాసార్వడవలి వరకు ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు తుది నివేదిక (డీపీఆర్)ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది. అంచనా వ్యయం : ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.10 వేల కోట్లు అవుతుందని అంచనావేశారు. కానీ పెరిగిన సామగ్రి ధరలు, తీవ్ర జాప్యం కారణంగా వ్యయం తడిసి మోపెడైంది. ప్రస్తుతం అది రూ.22 వేల కోట్లకు చేరుకుంది. భూగర్భ మార్గం పనులకు వ్యయం ఎక్కువే అవుతోంది. ఈ ప్రాజెక్టులో జరిగిన మార్పుల వల్ల వడాల నుంచి కాసార్వడవలి వరకు మాత్రమే భూగర్భ మార్గం ఉండగా, మిగతాది ఎలివేటెడ్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టు వ్యయం కొంతమేర తగ్గింది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు... వడాల-కాసార్వడవలి (ఠాణే) వరకు చేపట్టనున్న ఈ మెట్రో రైలు మార్గం పది చోట్ల మెట్రో-1 ప్రాజెక్టుకు కనెక్టివిటీ ఉంటుంది. కొన్ని చోట్ల మోనో రైల్వే స్టేషన్లతో కూడా కనెక్టివిటీ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రయాణికులకు ఏ రైలు ఎక్కాలన్నా ట్యాక్సీ లేదా ఆటోను గానీ ఆశ్రయించాల్సిన అవసర ముండదు. ప్రస్తుతం నగరంలో సేవలు అందిస్తున్న వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైల్వే స్టేషన్లతో కూడా కనెక్టివిటీ చేయనున్నారు. దూరం...: 30.8 కి.మీ. దూరం గల ఈ మార్గంపై మొత్తం 32 స్టేషన్లు ఉంటాయి. ఇందులో 26 స్టేషన్లు భూగర్భంలో, ఆరు స్టేషన్లు ఎలివేటెడ్ ఉంటాయి. ముంబై హద్దులో 20 స్టేషన్లు ఉండగా మిగతా స్టేషన్లు ఠాణే హద్దులో ఉంటాయి. ఈ ప్రాజెక్టు రూట్.. వడాల, ఆణిక్, ప్రయదర్శిని ప్రాంతంలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వే కింది నుంచి కుర్లా, లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ), ఘాట్కోపర్ ఆ తర్వాత ఎల్బీఎస్ రోడ్డు మీదుగా ఠాణే దిశగా వెళుతుంది.