'కేజ్రివాల్ కు అంత సీన్ లేదు'
'కేజ్రివాల్ కు అంత సీన్ లేదు'
Published Mon, Mar 17 2014 1:38 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ కు అంత సీన్ లేదని బీజేపీ తేల్చేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కేజ్రివాల్ నుంచి ఎలాంటి ముప్పులేదని బీజేపీ మీడియా కన్వీనర్ హరీష్ ఖురానా తెలిపారు. కేజ్రివాల్ ను మేము అంత సీరియస్ గా తీసుకోవడం లేదని ఖురానా స్పష్టం చేశారు. దేశమంతటా మోడీ హవా కొనసాగుతోందని ఆయన అన్నారు.
ఢిల్లీలో 49 రోజుల పాలన అత్యంత దారుణమని.. కేజ్రివాల్ క్రెడిబిలిటీ కోల్పోయాడని ఖురానా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తర ప్రదేశ్ లోనే కాకుండా ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలువదని ఖురానా జోస్యం చెప్పారు. నరేంద్రమోడీని ఓడించే అంత శక్తి కేజ్రివాల్ కు లేదన్నారు.
వారణాసి లోకసభలో నిలిచిన నరేంద్రమోడీని ధీటుగా ఎదుర్కొంటామని.. మార్చి 23 తేదిన తుది నిర్ణయం తీసుకుంటామని బెంగళూరు సభలో కేజ్రివాల్ కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని 80 సీట్లలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి వారణాసి బరిలో నరేంద్రమోడీని బీజేపీ పోటీలో నిలిపింది.
Advertisement
Advertisement