తెలంగాణపై యూటర్న్ తీసుకోలేదు: రాజ్ నాథ్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉంది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూటర్న్ తీసుకోలేదు అని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాలకు మేలు కలిగేలా యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది అని అన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతోంది అని ఆయన ఆరోపించారు.
యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగిస్తోంది అని అన్నారు. జాతీయ అధ్యక్షుడిగా మా పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నానని రాజ్ నాథ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.