ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా : 12.8 శాతం కరోనా వైరస్ మరణాల రేటుతో పశ్చిమ బెంగాల్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆ రాష్ట్రంలో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పేర్కొంది. సోమవారం కేంద్ర బృందం అధ్యక్షులు అపూర్వ చంద్ర.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రెండు వారాల పాటు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించి కరోనా పరిస్థితులపై సమీక్షించిన కేంద్ర బృందం పట్ల ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించలేదని తెలిపారు. కరోనా కేసులపై ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్‌లోని కేసుల సంఖ్యకు, కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్న సంఖ్యకు పొంతన లేదని పేర్కొన్నారు. ( లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం )
మరణాల రేటు ఎక్కువగా ఉండటాన్ని బట్టి, రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. కేసులను గుర్తించటంలోనూ, వాటిపై నిఘా పెట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 922 కేసులు నమోదు కాగా, 33 మంది మృత్యువాత పడ్డారు. ( మందు బాబులపై పేలుతున్న జోకులు )
Comments
Please login to add a commentAdd a comment