'మొబైల్స్, అశ్లీల వస్త్రధారణ అత్యాచారాలకు కారణం'
'మొబైల్స్, అశ్లీల వస్త్రధారణ అత్యాచారాలకు కారణం'
Published Thu, Oct 30 2014 12:55 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
లక్నో: మొబైల్ ఫోన్ల వాడకం, పాశ్చాత్య సంస్కృతి, అశ్లీల వస్త్రధారణ అంశాలే అత్యాచారాలకు కారణమని సమాచార హక్కు కింద దాఖలైన ఓ పిటిషన్ సమాధానమిస్తూ ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఓ నివేదికలో వెల్లడించారు.
జిల్లాల వారిగా అత్యాచార సంఘటనలు, వాటిని నివారించడానికి అధికారులు తీసుకున్న చర్యలు, ఈ ఘటనలో చేసిన అరెస్టులపై వివరణ ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి దాఖలు పిటిషన్ దాఖలు చేశారు.
సామాజిక కట్టుబాట్లలో మార్పుల కారణంగా అత్యాచార సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని నివేదికలో పోలీసులు వెల్లడించారు, అంతేకాకుండా అత్యాచార సంఘటనలు ఓ సామాజిక సమస్య అని వెల్లడించినట్టు సమాచారం.
Advertisement
Advertisement