న్యూఢిల్లీ: దేశంలో నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిని అరికట్టడానికి రెండో దశ రేడియో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, త్రిపుర, పశ్చిమబెంగాల్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో బుధవారం నుంచి రేడియో ద్వారా వాట్సాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ 10 రాష్ట్రాల్లోని 83 ఆలిండియా రేడియో స్టేషన్లలో ప్రకటనలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment