‘చంద్రబాబు తలా తోకా లేకుండా వ్యవహరిస్తున్నారు’
ఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఎంపీ సిరిసిల్ల రాజయ్య మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో ఆయన మౌనదాల్చడాన్నిఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాజయ్య.. చంద్రబాబు తలా తోకా లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో విసుగు చెందిన టీడీపీ నాయకుల పార్టీ మారడానికి యత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓ వైపు సమైక్యాంధ్ర టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో విన్యాసాలు చేస్తుంటే, టీడీపీ తెలంగాణ ఫోరం నాయకులు చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. సీమాంధ్ర నాయకులు నిరసన గళం వినిపిస్తుంటే..తెలంగాణ టీడీపీ నాయకులు ఏమీ మాట్లాడకపోవడం వెనకు ఆంతర్యం ఏమిటన్నారు.
మరో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్దంతాన్ని మరోసారి బయటపెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణకు అనుకూలమని చెప్పుకుంటున్న బాబు సీమాంధ్ర ఎంపీలతో పార్లమెంట్‌లో నాటకాలు ఆడిస్తున్నారని దుయ్యబట్టారు.