
వైట్ హౌస్ స్పందన
న్యూఢిల్లీ: ఒబామా పర్యటన భారత్-అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరిన అనంతరం మోదీ ఈ మేరకు ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు. ''ఒబామాకు వీడ్కోలు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి'' అని మోదీ అన్నారు.
వైట్‌హౌస్ కూడా దీనికి స్పందించింది. ''ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా మలిచినందుకు థాంక్యూ నరేంద్రమోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు కతజ్ఞతలు''అంటూ అధ్యక్షుడి కార్యాలయం బదులిచ్చింది. దీన్ని మోదీ ట్వీటర్‌లో పొందుపరిచారు.
Thank you @NarendraModi for a memorable visit, and to the Indian people for their warm welcome. #India -bo
— The White House (@WhiteHouse) January 27, 2015