ఎన్ఐఏ అధికారి భార్య కూడా..
న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారి మొహమ్మద్ తంజిల్ అహ్మద్ భార్య ఫర్జానా అహ్మద్ (44) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లో ఈ నెల 4వ తేదీన తంజిల్ అహ్మద్పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తంజిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన సతీమణి తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆమె ఈరోజు ఉదయం 11 గంటలకు మరణించారు. తంజీల్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు మాత్రం పరారీలోనే ఉన్నాడు. కాగా వ్యక్తిగత కారణాలతోనే ఎన్ఐఏ అధికారిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.