తన చేతిలోని నగదు బ్యాగును కొట్టేసి పారిపోతున్న ఓ దొంగని చిరుతలా పరుగెత్తి పట్టుకుని పట్టుకుంది ఓ మహిళ.
పళ్లిపట్టు(తమిళనాడు): తన చేతిలోని నగదు బ్యాగును కొట్టేసి పారిపోతున్న ఓ దొంగని చిరుతలా పరుగెత్తి పట్టుకుని పట్టుకుంది ఓ మహిళ. అ తర్వాత దొంగను ఆ మహిళ చితకబాదింది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుత్తణిలో చోటుచేసుకుంది. తిరుత్తణి జేజే నగర్ ప్రాంతానికి చెందిన సుమతి(39), ఆమె చెల్లి శాంతి(35) బస్టాండు సమీపంలోని ఏటీఎంకు వెళ్లారు. అక్కడ రూ.40 వేలు డ్రా చేసుకుని బ్యాగులో పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేస్తుండగా అంతా గమనిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా బ్యాగును లాక్కుని పారిపోయాడు.
ఆమె దొంగ దొంగ అంటూ కేకలు వేసినా దొంగను పట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె చిరుతలా పరుగెత్తి, దొంగని వెంబడించి పట్టుకుంది. నగదు బ్యాగును దొంగనుంచి తీసుకుని అతన్ని పోలీసులకు అప్పగించింది. నిందితుడు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన వినోద్(38) అని పోలీసులు గుర్తించారు. అతడు తరుచూ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో చెప్పాడు.