యూపీలో మరో సామూహిక అత్యాచారం.. ఉరి!! | Woman Found Hanging from Tree in Uttar Pradesh, Family Alleges Gang Rape | Sakshi
Sakshi News home page

యూపీలో మరో సామూహిక అత్యాచారం.. ఉరి!!

Published Wed, Jun 11 2014 9:32 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

యూపీలో మరో సామూహిక అత్యాచారం.. ఉరి!!

యూపీలో మరో సామూహిక అత్యాచారం.. ఉరి!!

ఉత్తరప్రదేశ్లో ఓ మహిళ చెట్టుకు ఉరేసి కనపడింది. కొందరు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన అచ్చం బదయూ ఘటన లాగే ఉంది. అక్కడ 14, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కొత్త కేసు గత రాత్రి బహరైచ్ జిల్లాలో జరిగింది.

స్థానిక లిక్కర్ మాఫియా నుంచి తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆమె ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసిందని బాధితురాలి కుమారుడు చెబుతున్నాడు. లక్నోకు వెళ్లిన ఆమెకు కొడుకు ఫోన్ చేసి, మనవడిని చూసేందుకు గ్రామానికి రావాలని కోరాడు. ముందుగా అనుకున్న స్థలంలో ఆమెను తీసుకెళ్లేందుకు తాను వెళ్లగా ఆమె లేదని, చీరతో చెట్టుకు ఉరేసి.. ఆమె సెల్ఫోన్ను కూడా అక్కడే పారేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన విషయాన్ని కొట్టిపారేయలేమని, పోస్టుమార్టం నివేదిక కోసం తాము వేచి చూస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి సునీల్ కుమార్ సింగ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement